- Telugu News Photo Gallery Cinema photos No big release after Devara, the makers have taken October calendar lite
October Movies: దేవర తర్వాత నో బిగ్ రిలీజ్.. అక్టోబర్‌ను లైట్ తీసుకొన్న మేకర్స్..
ఒక్క డేట్ కోసం మూడు నాలుగు సినిమాలు పోటి పడుతున్న టైమ్‌లో అక్టోబర్ క్యాలెండర్‌ను ఖాళీగా వదిలేశారు టాలీవుడ్ మేకర్స్. సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన దేవర తరువాత టాలీవుడ్‌లో బిగ్ రిలీజ్ అన్న రేంజ్‌లో సందడే లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి దీపావళి మీద ఉంది.
Updated on: Oct 21, 2024 | 1:52 PM

సెప్టెంబర్ 27న దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత బిగ్ రిలీజ్ అన్న రేంజ్ మూవీ ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దసరా పండక్కి కూడా టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలెవరూ బరిలో దిగలేదు.

దీంతో ఆ వీక్ కూడా విశ్వం, మా నాన్న సూపర్ హీరో, జనకా అయితే గనక లాంటి చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మూడు సినెమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

గత వారం పేరుకు ఏడు సినిమాలు రిలీజ్ అయినా... ఒక్క సినిమాకి కూడా బజ్ లేదు. లవ్ రెడ్డి, వీక్షణం లాంటి సినిమాలకు కాస్త ప్రమోషన్ చేసినా... ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే స్థాయి కంటెంట్ ఆ సినిమాల్లో కనిపించలేదు.

ఈ వారం కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఓ బిగ్ మూవీ రిలీజ్ అయిన మూడు వారాలు దాటిన... మినిమం రేంజ్ సినిమా కూడా థియేటర్లలోకి రావటం లేదు. లగ్గం, పొట్టేల్ లాంటి సినిమాలకు కాస్త అగ్రెసివ్‌గా ప్రమోషన్ చేస్తున్నా ఆశించిన స్థాయిలో బజ్ రావటం లేదు.

ఇప్పుడు ఆశలన్నీ దివాళీ వీక్ మీదే పెట్టుకుంది టాలీవుడ్. నెలాఖరున లక్కీ భాస్కర్, క సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రెండు పాన్ ఇండియా రిలీజ్‌లే కావటంతో ఆల్రెడీ ప్రమోషన్స్‌లో స్పీడు పెంచారు మేకర్స్. అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలైన సిల్వర్ స్క్రీన్ మీద సందడి క్రియేట్ చేస్తాయేమో చూడాలి.




