Mahabubabad: ఎలుకల పాలైన రెండున్నర లక్షల రూపాయలు.. బాధితుడికి అండగా నిలిచిన మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్..

Mahabubabad: చికిత్స కోసం దాచుకున్న రెండున్నర లక్షల రూపాయలను ఎలుకలు కొట్టిన ఘటన తెలిసిందే. మహబూబాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనపై

Mahabubabad: ఎలుకల పాలైన రెండున్నర లక్షల రూపాయలు.. బాధితుడికి అండగా నిలిచిన మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్..
Currency Notes 2
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 18, 2021 | 7:15 PM

Mahabubabad: చికిత్స కోసం దాచుకున్న రెండున్నర లక్షల రూపాయలను ఎలుకలు కొట్టిన ఘటన తెలిసిందే. మహబూబాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనపై మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ స్పందించారు. బాధితుడు రెడ్యా నాయక్‌కు అండగా నిలిచారు. వైద్యం కోసం దాచుకున్న డబ్బులు ఎలుకల పాలవడంతో కూరగాయల వ్యాపారి రెడ్యానాయక్‌ బోరున విలపించాడు. అతని దుస్థితిపై టీవీ9లో ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆ కరెన్సీని స్వాధీనం చేసుకుని అతనికి తగిన ఆర్థిక సహాయం అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్ర గిరిజిన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా స్పందించారు. బాధితుడికి సహాయం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇరువురు మంత్రుల ఆదేశాలతో రంగంలోకి దిగిన మండల రెవెన్యూ అధికారులు.. ఇంద్రానగర్‌ తండాలోని రెడ్యానాయక్ ఇంటికి వెళ్లారు. ఎలుకలు కొరికిన కరెన్సీ వివరాలను సేకరించారు.

Currency Notes

ఇదిలాఉంటే.. మంత్రి సత్యవతి రాథోడ్.. బాధితుడు రెడ్యా నాయక్‌కు ఫోన్ చేశారు. రెడ్యా దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే.. ఆయన కోరుకున్న చోట మెరుగైన వైద్యం కూడా అందిస్తామని భరోసా ఇచ్చారు. డబ్బుల విషయంలో గానీ, చికిత్స విషయంలో గానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెడ్యాకు మంత్రి సత్యవతి ధైర్యం చెప్పారు. మంత్రుల స్పందనతో రెడ్యా సంతోషం వ్యక్తం చేశాడు. మంత్రులిరువురికీ కృతజ్ఞతలు తెలిపాడు.

మహబూబాబాద్ జిల్లాలోని ఇంద్రానగర్‌ తండాకు చెందిన రెడ్యా నాయక్‌ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అతని ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స కోసం కొంత కాలంగా డబ్బులు దాచుకుంటూ వస్తున్నాడు. కానీ, దురదృష్టం అతన్ని ఎలుకల రూపంలో వెంటాడింది. ఇంతకాలం కష్టపడి దాచుకున్న సొమ్ము సుమారు రెండున్నర లక్షల రూపాయలను ఎలుకలు కొరికిపారేశాయి. అది చూసి రెడ్యా గుండె చెరువైపోయింది. బోరున విలపించాడు. విషయం కాస్తా మీడియాకు తెలియడంతో ప్రసారం చేశారు. అతని బాధను వెల్లడించారు. చివరికి రెడ్యా పరిస్థితి మంత్రులకు చేరడంతో వారు అండగా నిలిచారు.

Also read:

యూపీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధం.. మాదీ ఓపెన్ మైండ్.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ

HECL Job Notification: టెన్త్, ఇంటర్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్

బుల్లెట్ గాయాల వల్లే ఫోటోజర్నలిస్టు డానిష్ సిద్దిఖీ మరణించాడు.. కాబూల్ లోని భారత ఎంబసీ ప్రకటన..

తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!