AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: దర్యాప్తు సంస్థలు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశాయి.. కేంద్రానికి తొత్తులుగా మారిపోయాయి: కేటీఆర్‌

ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి దర్యా్ప్తు సంస్థలు మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వేటకుక్కలుగా మారిపోయాయని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

KTR: దర్యాప్తు సంస్థలు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశాయి.. కేంద్రానికి తొత్తులుగా మారిపోయాయి: కేటీఆర్‌
Minister Ktr
Basha Shek
|

Updated on: Apr 23, 2022 | 6:04 AM

Share

ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి దర్యా్ప్తు సంస్థలు మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వేటకుక్కలుగా మారిపోయాయని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (KTR) విమర్శించారు. డబుల్ ఇంజిన్‌ అంటే మోడీ..ఈడీ.. తప్పు చేసిన వాళ్లు వీరికి భయపడతారేమో కానీ తామెందుకు భయపడతామని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘తెల్లారిలేస్తే కేసీఆర్‌ను జైలుకు పంపుతామని కొందరు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వంలో తప్పులేమైనా ఉంటే నిరూపించండి. ఎదుర్కొనడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ దేశంలో బీజేపీ నాయకులందరూ హరిశ్చంద్రులు.. వాళ్ల కజిన్స్‌ బ్రదర్స్‌.. సర్వ సంగపరిత్యాగులు అని ఫీలవుతున్నారు’ అని టీవీ9కు ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కేటీఆర్‌.

‘దేశంలో అన్నీ ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా అలాగే నడుస్తోంది. దేశంలో బీజేపీ 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది. అక్కడా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కడుతున్నారు. నీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. వాటన్నిటినీ సత్యహరిశ్చంద్రులు కూర్చొని అన్నీ సవ్యంగా జరిపిస్తున్నారా? ఇక్కడ మాత్రమే తప్పులు జరుగుతున్నాయా? ఒకవేళ మా ప్రాజెక్టుల్లో తప్పులుంటే పట్టుకోండి. మేం వద్దనడం లేదు. కానీ ఈడీ, మోడీ అంటూ కేవలం బీజేపీయేతర రాష్ట్రాలపైనే ఎందుకు పడుతున్నారు? దీని వెనక ఎజెండా ఏమిటీ? గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌ లో అంత సవ్యంగా జరుగుతోందా? దేశంలో కనీసం ఒక్క బీజేపీ నాయకుడైనా అరెస్టైన ఉదంతం కనిపించిందా? ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం వేటకుక్కలుగా మారిపోయాయి. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఒకరి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు’ అని మండిపడ్డారు కేటీఆర్‌.

కాగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. వరి కొనుగోలు, గవర్నర్‌ వ్యవహారం, నదీజలాల వాటా తదితర అంశాలపై పరస్పరం విమర్శలు చేస్తూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ తాజాగా టీవీ9కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ప్రధాని మోడీ, బీజేపీ, రాష్ట్ర రాజకీయాలపై ఆయన ఏమన్నారో ఈ కింది వీడియోలో చూద్దాం.

Also Read: KTR: కొత్త పార్టీల వెనక ఎవరున్నారో తెలుసు.. షర్మిలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

KTR: మోడీ గాడ్సే భక్తుడని నేనూ అంటాను.. దమ్ముంటే జైల్లో పెట్టండి.. ప్రధానిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

AP CM Jagan: టీడీపీకి ఓటుపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం జగన్.. ఇంతకీ ఏమన్నారంటే..