AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: మోడీ గాడ్సే భక్తుడని నేనూ అంటాను.. దమ్ముంటే జైల్లో పెట్టండి.. ప్రధానిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

KTR On PM Narendra Modi:  ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) చెప్పేవన్నీ గాంధీ మాటలు అని, చేసేవన్నీ మాత్రం గాడ్సే పనులని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు

KTR: మోడీ గాడ్సే భక్తుడని నేనూ అంటాను.. దమ్ముంటే జైల్లో పెట్టండి.. ప్రధానిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Basha Shek
|

Updated on: Apr 23, 2022 | 12:18 AM

Share

KTR On PM Narendra Modi:  ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) చెప్పేవన్నీ గాంధీ మాటలు అని, చేసేవన్నీ మాత్రం గాడ్సే పనులని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. డబుల్‌ ఇంజిన్‌ నరేంద్ర మోడీ.. ఈడీలంటే తప్పుచేసిన వాళ్లు భయపడతారని, తామెందుకు భయపడతామని ఘాటుగా విమర్శించారు.  ‘ జిగ్నేశ్‌ మేవాని నరేంద్ర మోడీ గాడ్సే భక్తుడు అని ట్వీట్‌ చేశాడు. వెంటనే ఆయనను అరెస్ట్‌ చేశారు. ఇప్పుడు నేను కూడా అంటున్నా.. మోడీ గాడ్సే భక్తుడు. దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి చూస్తాను. మోడీ చెప్పేవన్నీ గాంధీ మాటలు. కానీ చేసేవన్నీ గాడ్సే పనులే. నేను చెప్పింది నిజం కాకపోతే అందరి ముందు బయటకు వచ్చి నా మాటలను ఖండించాలి. ‘స్వతంత్ర భారతంలో మొట్ట మొదటి టెర్రరిస్టు గాడ్సే అన్న మాట ప్రధాని నోటివెంట రావాలి’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ మేరకు టీవీ9కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ మాటలన్నారు కేటీఆర్.

‘మహాత్మాగాంధీని చంపిన వాడు తీవ్రవాది కాదా?  వాడిని దేవుడిని చేస్తూ బీజేపీ ఎంపీలు, నాయకులు చేసిన వ్యాఖ్యలను ఏనాడైనా మోడీ ఖండించారా? అదే జిగ్నేశ్‌ మేవానీ అంటే అరెస్ట్‌ చేసి జైల్లో పెడతారు. అదేవిధంగా అకార్‌ పటేల్‌ అనే జర్నలిస్టు ప్రధానికి వ్యతిరేకంగా పుస్తకం రాస్తే.. ఆయనను ఎయిర్‌పోర్టుల్లో నిర్భంధించారు. జిగ్నేశ్‌ కాదు.. ఇప్పుడు నేనంటున్నా.. మోడీ గాడ్సే భక్తుడు. నేను నా మాటలకు కట్టుబడి ఉన్నాను. నన్ను అరెస్ట్‌ చెయ్యండి చూద్దాం’ అని సవాల్ విసిరారు కేటీఆర్.

కాగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. వరి కొనుగోలు, గవర్నర్‌ వ్యవహారం, నదీజలాల వాటా తదితర అంశాలపై పరస్పరం విమర్శలు చేస్తూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ తాజాగా టీవీ9కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ప్రధాని మోడీ, బీజేపీ, రాష్ట్ర రాజకీయాలపై  ఆయన ఏమన్నారో ఈ కింది వీడియోలో చూద్దాం.

Also Read: Jbardastha Varsha: బ్లూ డ్రెస్ బుల్లితెర బ్యూటీ.. వర్ష హోయలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Andhra Pradesh Politics: 2024 ఎన్నికలే టార్గెట్‌గా రంగంలోకి చంద్రబాబు.. సీనియర్లకు వార్నింగ్స్..!

Viral Video: అరరే.. ఎంత పనాయే.. చూసుకోవాలి కదమ్మ.. ఫోన్ మాట్లాడుతూ ప్రాణాలమీదుకు తెచ్చుకుంది..