AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: కొత్త పార్టీల వెనక ఎవరున్నారో తెలుసు.. షర్మిలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రత్యర్థులు పెరిగారని, అయితే ప్రజల ప్రేమ అలాగే ఉందని కేటీఆర్‌ (KTR) తెలిపారు. గత రెండు ఎన్నికల మాదిరిగానే 2024లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితో జతకట్టమని మంత్రి పేర్కొన్నారు.

KTR: కొత్త పార్టీల వెనక ఎవరున్నారో తెలుసు.. షర్మిలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Ktr And Ys Sharmila
Basha Shek
|

Updated on: Apr 23, 2022 | 12:47 AM

Share

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రత్యర్థులు పెరిగారని, అయితే ప్రజల ప్రేమ అలాగే ఉందని కేటీఆర్‌ (KTR) తెలిపారు. గత రెండు ఎన్నికల మాదిరిగానే 2024లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితో జతకట్టమని మంత్రి పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో పుట్టుకొస్తున్న కొత్త పార్టీల వెనక ఒక పెద్దాయన స్కెచ్‌ ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ ప్రజల మీద భారం, మా నాయకుడి సామర్థ్యం మీద విశ్వాసం ఉండే 2014, 2019 ఎన్నికలకు వెళ్లాం. ఈసారి దీనికి ఏ మాత్రం భిన్నంగా ఉండదు. మాకు ప్రత్యర్థులు పెరిగారు తప్ప.. ప్రజల మాతోనే ఉన్నారు. ఇక రాష్ట్రంలో పుట్టుకొస్తున్న కొత్త పార్టీలకు కారణమేంటో కూడా అందరికీ తెలియాల్సిన అవసరముంది’ అని టీవీ9 కు ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో మంత్రి పేర్కొన్నారు.

‘షర్మిల గారు టీఆర్‌ఎస్‌ను తిడుతోంది. మరి మోడీ గురించి వ్యతిరేకంగా ఒక్కమాటైనా మాట్లాడిందా? అసలు ఆమెకు, తెలంగాణకు ఏం సంబంధం? అన్న మీద కోసం ఉంటే ఏపీలో పార్టీ పెట్టాలి కానీ? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు ఇక్కడ రాజకీయాలు చేయడం దేనికి? తెలంగాణ ఆవిర్భవిస్తే వీసాలు తీసుకుని వెళ్లాల్సి వస్తుందని వాళ్ల నాయన గతంలో చెప్పారు. మరి ఇప్పుడామే ఏ వీసామీద ఇక్కడ ఉన్నారో చెప్పాలి. ఇక ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఐపీఎస్‌ అధికారిగా ఉన్నారు. ఆసమయంలో తెలంగాణ ఉద్యమాన్ని ఎలా తొక్కేయాలో ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ బిడ్డ అని తిరుగుతున్నాడు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్‌ చాలా మంచి పనులు చేస్తున్నారని ఆయన పొగిడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడేమో కేసీఆర్‌ను తిడుతున్నాడు. ఇక్కడ మరో విషయం.. విద్యాసంస్థలకు సంబంధించి కేంద్రం ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వకపోతే. మరి దీనిపై ఆయన నోటి నుంచి ఒక్కమాట కూడా ఎందుకు రాలేదు? అసలు ఎవరు వీళ్లంతా? ఎవరి ప్రోద్భలంతో మాట్లాడుతున్నారు? ‘ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. వరి కొనుగోలు, గవర్నర్‌ వ్యవహారం, నదీజలాల వాటా తదితర అంశాలపై పరస్పరం విమర్శలు చేస్తూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ తాజాగా టీవీ9కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ప్రధాని మోడీ, బీజేపీ, రాష్ట్ర రాజకీయాలపై ఆయన ఏమన్నారో ఈ కింది వీడియోలో చూద్దాం.

Also Read: KTR: అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా నేను రెడీ .. ప్రధాని మోడీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Meenakshi Chaudhary:పింక్ శారీ లో పిచ్చెకిస్తున్న మీనాక్షి.. ఇంత అందానికి ఫిదా కానీ వారుంటారా

Fodder Scam: దాణా కుంభకోణం కేసులో లాలూప్రసాద్‌ యాదవ్‌కు బెయిల్‌ మంజూరు