AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అరరే.. ఎంత పనాయే.. చూసుకోవాలి కదమ్మ.. ఫోన్ మాట్లాడుతూ ప్రాణాలమీదుకు తెచ్చుకుంది..

మొబైల్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి చేరిపోయింది.

Viral Video: అరరే.. ఎంత పనాయే.. చూసుకోవాలి కదమ్మ.. ఫోన్ మాట్లాడుతూ ప్రాణాలమీదుకు తెచ్చుకుంది..
Viral Video
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2022 | 9:16 PM

Share

మొబైల్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి చేరిపోయింది. పెద్దవారు మాత్రమే కాకుండా.. టీనేజర్స్ సైతం గంటల తరబడి ఇంటర్నెట్‏లో మునిగితేలుతుంటారు. అంతేకాదండోయ్.. ఫోన్ చూస్తూనే రోడ్డుపై వెళ్లడం.. మాట్లాడుతూ వాహనాలు డ్రైవ్ చేస్తుంటారు. దీంతో ప్రమాదాల బారిన పడుతుంటారు. ఫోన్ మాట్లాడుతూ వారు ప్రమాదాల బారిన పడడమే కాకుండా… ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. ఫోన్ మాట్లాడుతూ.. చూస్తూ.. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతారు. తాము ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు అనే విషయాన్ని సైతం మర్చిపోతారు. అలా ఫోన్ మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ వెళ్లి మ్యాన్ హోల్లో పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోను ఉత్కర్ష్ సింగ్ అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. అందులో ఓ మహిళ ముందు ఆటో ఉంటుంది. ఆ ఆటో వెళ్లిపోగానే.. ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ అదే దారి వెంట వస్తుంది. అయితే ఫోన్ మాట్లాడుతూనే అటు ఇటు చూస్తూ నడుస్తూ ఒక్కసారిగా మ్యాన్ హోల్లో పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న యువకులు అప్రమత్తమై ఆమెను బయటకు తీయడంతో స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన పాట్నలో ఎప్పుడు జరిగిందనేది తెలియదు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Samantha: నా మౌనాన్ని బలహీనత అనుకోవద్దు.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ ట్వీట్..

Allu Arjun: పుష్పరాజ్ పై పొగడ్తలు కురిపించిన కేజీఎఫ్ 2 బ్యూటీ.. నేను మీ వీరాభీమానినంటూ..

Jersey Movie: జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించిన న్యాచురల్ స్టార్.. మీ మంచి మనసే కారణమంటూ స్టార్ హీరో రిప్లై..

Health Tips: వేసవిలో వీటిని రాత్రంతా నానబెట్టి తింటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. అవెంటో తెలుసా..