AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: మజ్లిస్‌తో పొత్తు పెట్టుకోం.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం: మంత్రి కేటీఆర్‌

మజ్లిస్‌ పార్టీతో ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదని, వచ్చే ఎలక్షన్లలోనూ ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) స్పష్టం చేశారు.

KTR: మజ్లిస్‌తో పొత్తు పెట్టుకోం.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం: మంత్రి కేటీఆర్‌
Ktr
Basha Shek
|

Updated on: Apr 23, 2022 | 5:56 AM

Share

మజ్లిస్‌ పార్టీతో ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదని, వచ్చే ఎలక్షన్లలోనూ ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) స్పష్టం చేశారు. 119 స్థానాల్లో కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఎంఐఎం పార్టీపై ఇంత రాజకీయ చర్చ ఎందుకు నడుస్తుందో తనకు అర్థం కావడం లేదని మంత్రి పేర్కొన్నారు. ‘మజ్లిస్‌ పార్టీతో మేం ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదు. ఇకపైనా పెట్టుకోం. మేం పాతబస్తీలో పోటీ చేస్తాం. వారు మాపై పోటీచేస్తారు. ఇంకెక్కడ అలయెన్స్‌ ఉందో నాకు అర్థం కావడం లేదు. 2014, 2018 కార్పొరేషన్‌ ఎన్నికలను అందరూ గమనించి ఉంటారు. ఆ ఎన్నికల్లో మేం ప్రత్యర్థులుగానే బరిలోకి దిగాం అన్న విషయం అందరికీ తెలిసిందే ‘ అని టీవీ9కు ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు కేటీఆర్‌.

బండి సంజయే సమాధానం చెప్పాలి.. ‘ఇక ఎంఐఎం అనేది ఒక రాజకీయ పార్టీ. వారు ఎక్కడ, ఎలా, ఎన్ని స్థానాల్లో పోటీచేస్తారనేది వారిష్టం. ఇక ఈ పార్టీ వెనక మోడీ ఉన్నారని చాలామంది అంటున్నారు. ఇది నిజమా?కాదా? అని బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎంతో మాకు సంబంధం అంటగడతారు. బయటేమో వారు ముస్లిం ఓట్లు విభజిస్తారని ఇంకేదో మాట్లాడతారు. ఏది కరెక్ట్‌ అనేది ప్రజలే నిర్ణయిస్తారు. అదేవిధంగా భారతదేశం అంతటా విస్తరిస్తోన్న ఎంఐఎంను కేసీఆర్‌ తెలంగాణలో కేవలం పాతబస్తీకే పరిమిత చేశాడని ఎందుకు అనుకోకూడదు? ఇది ఆయన గొప్పతనం కాదా? మావరకు అభివృద్దే మా కులం.. సంక్షేమమే మా మతం.. జనహితమే మా అభిమతం..దీని ప్రకారమే ముందుకు వెళతాం. ఈ తెలంగాణలో కులం, మతం ఆధారంగా ప్రభావితమయ్యేవారు కేవలం ఒకటి లేదా రెండు శాతం మాత్రమే ఉంటారు. అంతేకానీ చిల్లర విషయాలకు ప్రభావితమయ్యే వాళ్లు ఉండరు’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కాగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. వరి కొనుగోలు, గవర్నర్‌ వ్యవహారం, నదీజలాల వాటా తదితర అంశాలపై పరస్పరం విమర్శలు చేస్తూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ తాజాగా టీవీ9కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ప్రధాని మోడీ, బీజేపీ, రాష్ట్ర రాజకీయాలపై  ఆయన ఏమన్నారో ఈ కింది వీడియోలో చూద్దాం.

Also Read:KTR: దర్యాప్తు సంస్థలు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశాయి.. కేంద్రానికి తొత్తులుగా మారిపోయాయి: కేటీఆర్‌

Andhra Pradesh Politics: 2024 ఎన్నికలే టార్గెట్‌గా రంగంలోకి చంద్రబాబు.. సీనియర్లకు వార్నింగ్స్..!

IPL 2022: ఢిల్లీని బాదేసిన బట్లర్.. కేవలం 57 బంతుల్లో సీజన్‌లో మూడో సెంచరీ.. ఆ లిస్టులో అగ్రస్థానం..