KTR: తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ (KTR) తెలిపారు. దేశంలోని ఆర్థిక పరిపుష్ఠి కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఆయన పేర్కొన్నారు

KTR: తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
Minister KTR
Follow us
Basha Shek

|

Updated on: Apr 23, 2022 | 1:49 AM

తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ (KTR) తెలిపారు. దేశంలోని ఆర్థిక పరిపుష్ఠి కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఆయన పేర్కొన్నారు. ‘2014లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్షా 24 వేల రూపాయలు. ఈరోజు 2లక్షల 78వేల రూపాయలు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ 5లక్షల 6వేల కోట్లు..ఈరోజు 11 లక్షల 55వేల కోట్లు. ఈరోజు మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోన్న నాలుగో అతిపెద్ద రాష్ట్రం మన తెలంగాణ. ఈ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలు దేశానికే తలమానికంగా మారాయి. మేం కూడా అప్పులు చేశాం. కానీ అవి ప్రజా సంక్షేమం కోసమే’ అని టీవ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కేటీఆర్‌.

వాటిని అప్పుల కింద చూడకూడదు.. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా బాగుచేయడానికి 85వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. దీనివల్ల పరిశ్రమలు అద్భుతంగా నడుస్తున్నాయి. ఫలితంగా సంపద పునరుత్పత్తి అవుతోంది. అదేవిధంగా 40వేల కోట్ల రూపాయలను మిషన్‌ భగీరథకు ఖర్చుపెట్టాం. దీనివల్ల ఇంటింటికీ పరిశుభ్రమైన నీరు అందించాం. అలాగే పరిశ్రమలకు సరిపడా నీటిని సరఫరా చేశాం. ఫలితంగా కలుషిత నీటి వ్యాధులు తగ్గిపోయాయి. ఇంకా కాళేశ్వరం, సీతారామ, పాలమూరు లాంటి ప్రాజెక్టులు కడుతున్నాం. ఉత్పాదక రంగంలో పెట్టిన డబ్బును పెట్టుబడి కింద చూడాలి గానీ అప్పుల కింద చూడకూడదు. ఇక తెలంగాణ డెబ్ట్‌ జీఎస్‌డీపీ రేటు 22శాతం. భారత దేశం డెబ్ట్‌ జీడీపీ రేటు 65 శాతం. అదేవిధంగా అమెరికా, జపాన్‌ల డెబ్ట్‌ జీడీపీ రేట్లు వరుసగా 108, 200 పర్సెంట్లుగా ఉన్నాయి. ఒక రూపాయి మారకం ఎంత ఎక్కువ జరిగితే అంత సంపద సృష్టించబడుతుంది. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నది ఇదే’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

కాగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. వరి కొనుగోలు, గవర్నర్‌ వ్యవహారం, నదీజలాల వాటా తదితర అంశాలపై పరస్పరం విమర్శలు చేస్తూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ తాజాగా టీవీ9కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ప్రధాని మోడీ, బీజేపీ, రాష్ట్ర రాజకీయాలపై  ఆయన ఏమన్నారో ఈ కింది వీడియోలో చూద్దాం.

Also Read:KTR: మజ్లిస్‌తో పొత్తు పెట్టుకోం.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం: మంత్రి కేటీఆర్‌

KTR: మోడీ గాడ్సే భక్తుడని నేనూ అంటాను.. దమ్ముంటే జైల్లో పెట్టండి.. ప్రధానిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

అందాలతో రచ్చ చేస్తున్న రకుల్.. వైరల్ అవుతున్న ఫోటోస్

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?