AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Weather Report: తెలంగాణ వాసులకు శుభవార్త.. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో..

Telangana Weather Report: మొన్నటి వరకు టెంపరేచర్‌ 40 డిగ్రీస్‌ దాటిపోయింది. ఉత్తర తెలంగాణలో అయితే ఫార్టీ ఫైవ్‌ డిగ్రీస్‌ టచ్‌ చేసింది.

Hyderabad Weather Report: తెలంగాణ వాసులకు శుభవార్త.. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో..
Hyd
Shiva Prajapati
|

Updated on: Apr 23, 2022 | 7:08 AM

Share

Telangana Weather Report: మొన్నటి వరకు టెంపరేచర్‌ 40 డిగ్రీస్‌ దాటిపోయింది. ఉత్తర తెలంగాణలో అయితే ఫార్టీ ఫైవ్‌ డిగ్రీస్‌ టచ్‌ చేసింది. అయితే ఠారెత్తించిన ఎండల నుంచి రిలీఫ్‌ దొరికింది. నిన్న, ఇవాళ కురిసిన జల్లులు ప్రజలకు ఉపశమనం ఇచ్చాయి. వడగాడ్పులు ఆగి చల్లని గాలులు పలకరించాయి. మరో రెండు మూడు రోజులు ఇదే వాతావరణం కంటిన్యూ అవుతుందని చల్లని కబురు చెప్పింది ఐఎండీ.

రేపు, ఎల్లుండి కూడా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఐఎండీ హైదరాబాద్‌ సెంటర్‌ డైరెక్టర్‌ కె.నాగరత్నం. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు కారణం ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావమని చెప్పారు.

ఇవాళ హైదరాబాద్‌తో పాటు పలుచోట్ల సమ్మర్‌ షవర్స్‌ పలుకరించి సేద తీర్చాయి. నిన్న కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. అనూహ్యంగా చల్లబడిన వాతావరణం రిలీఫ్‌ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడగానే మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ చెప్పింది. అయితే రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Also read:

Shruti Haasan: శృతిహాసన్‌కు చిర్రెత్తుకొచ్చే ప్రశ్న అడిగిన నెటిజన్.. అమ్మడు ఏం చేసిందంటే..

Chandrababu Naidu: చంద్రబాబు, బొండా ఉమకు ‘మహిళా కమిషన్’ నోటీసులు.. 27న హాజరు కావాలని..

Hanuman Chalisa Row: మహారాష్ట్రలో హీటెక్కిన హానుమాన్‌ చాలీసా రాజకీయం.. సీఎం ఇంటి ముందు చదువుతామన్న బీజేపీ