Minister KTR: ఇతర రాష్ట్రాల్లో మంచి పథకాలుంటే రాజీనామా చేస్తా.. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. విమర్శలు చేయడం సులువేనని.. కానీ పనులు చేయడమే కష్టమని మంత్రి అన్నారు.
Minister KTR Challenge: తెలంగాణ(Telangana) ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. కేంద్రం(Union Government)పై విమర్శల దాడిలో తగ్గేదేలే అంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) నేతలకు దేశ్ మే సవాల్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలను జాతీయస్థాయిలో ఏకం చేస్తున్న.. సీఎం కేసీఆర్(CM KCR) కు కొనసాగింపుగా మాటలకు దాడికి దిగారు మంత్రి కేటీఆర్. ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్‌గా కేసీఆర్ మాటల తూటాలు పేలుస్తుంటే.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు, బీజేపీ, కాంగ్రెస్ నేతలకు దేశ్ మే సవాల్ విసిరారు కేటీఆర్. మంత్రి సవాల్‌తో మరోసారి రాష్ట్ర రాజకీయాలు వేడేక్కాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. విమర్శలు చేయడం సులువేనని.. కానీ పనులు చేయడమే కష్టమని మంత్రి అన్నారు. ఎల్లారెడ్డిపేట్ మండలం వెంకటాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి ఎన్నో పథకాలు అందిస్తోందన్నారు. రాష్ట్రంలో జరగుతున్న అభివృద్ధి, పచ్చని పంటపొలాలు చూసి ప్రతిపక్షాలకు కడుపు మండుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉంటే తాను రాజీనామాకు సిద్ధమంటూ సవాల్ చేశారు కేటీఆర్. కులం, మతం పిచ్చితో రెచ్చగొడుతున్నారంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు కేటీఆర్.
మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ని టార్గెట్ గా కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. కాశీకి ప్రధాని మోడీ వెయ్యి కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామంటూ ఫోజులు కొడుతుంటే.. ఎంపీగా ఉన్న బండి సంజయ్ మీ పార్లమెంటు పరిధిలోని వేములవాడకు వంద కోట్లు తీసుకురావడం చేత కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుపై చర్చకు సిద్ధమన్నారు. ఏ ఊరు రమ్మంటే ఆ ఊరికి వస్తానని ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు.
సిరిసిల్ల కేంద్రంగా ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సందించారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల రూపురేఖలు మార్చేసిన ఘటన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. విమర్శలు చేయడం సులభం.. పనులు చేయడమే కష్టమంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు చురకలంటించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి పథకాలు అమలవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని.. రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని.. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సంఖ్య కూడా పెరిగిందన్నారు.
Read Also…