బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.. ఆలూకర్రీలో ప్రత్యక్షమైన కప్ప.. ఆగ్రహంతో విద్యార్థులు ఏం చేశారంటే

రోజువారీగానే వారు అల్పాహారం చేసేందుకు మెస్ కు వెళ్లారు. తరగతులకు సమయం అవుతుందని త్వర త్వరగా తింటున్నారు. ఇంతలో వారికి ఒళ్లు గగుర్పొడిచే విషయం తెలిసింది. తాము తింటున్న..

బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.. ఆలూకర్రీలో ప్రత్యక్షమైన కప్ప.. ఆగ్రహంతో విద్యార్థులు ఏం చేశారంటే
Basara Iiit
Follow us

|

Updated on: Mar 05, 2022 | 8:12 PM

రోజువారీగానే వారు అల్పాహారం చేసేందుకు మెస్ కు వెళ్లారు. తరగతులకు సమయం అవుతుందని త్వర త్వరగా తింటున్నారు. ఇంతలో వారికి ఒళ్లు గగుర్పొడిచే విషయం తెలిసింది. తాము తింటున్న టిఫిన్ కర్రీలో చనిపోయిన కప్ప ఉందని. విషయం తెలుసుకున్న విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT)లో కలకలం రేగింది. ఉదయం విద్యార్థులు అల్పాహారం చేస్తుండగా టిఫిన్ లో చనిపోయిన కప్ప ప్రత్యక్షమైంది. బ్రేక్ ఫాస్ట్ లో ఆలూ కుర్మాతో పాటు కప్ప(Frog) ను వడ్డించారంటూ సోషల్ మీడియాలో ఓ విద్యార్థి పోస్టు చేశాడు.ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత ఆహారం వడ్డించారంటూ ఆందోళన(Protest) చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉన్నత విద్య కోసం ఇళ్లు, కుటుంబాలను వదిలేసి ఇక్కడికొస్తే.. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యార్థులు నినాదాలు చేశారు.

మంచి భోజనం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో అది అమలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని.. తమ ఆరోగ్యానికి ఏమైనా ముప్పు వాటిల్లితే బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. వంట చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా అధికారులు, అధ్యాపకులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

Also Read

వింత! 7 తరాల తర్వాత ఆడపిల్ల పుట్టిందని.. ఏకంగా చందమామపై ఎకరం భూమిని కొని గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రలు!

రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.. ఇంతకీ వారేం చేశారంటే

Hyderabad Traffic: వాహనదారులకు గమనిక.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే