AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Traffic: వాహనదారులకు గమనిక.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే

హైదరాబాద్(Hyderabad నగరంలో రేపు షీటీమ్స్(She Teams) ఆధ్వర్యంలో 5కే, 2కే రన్ నిర్వహించనున్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఉదయం 6.30గంటలకు షీ టీమ్స్ 2కే, 5కే రన్ ప్రారంభం కానుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని..

Hyderabad Traffic: వాహనదారులకు గమనిక.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే
Hyderabad Traffic
Ganesh Mudavath
|

Updated on: Mar 05, 2022 | 6:24 PM

Share

హైదరాబాద్(Hyderabad నగరంలో రేపు షీటీమ్స్(She Teams) ఆధ్వర్యంలో 5కే, 2కే రన్ నిర్వహించనున్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఉదయం 6.30గంటలకు షీ టీమ్స్ 2కే, 5కే రన్ ప్రారంభం కానుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రన్ చేపట్టనున్నారు. ‘సుస్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం’ అనే నినాదంతో ఈ రన్‌ నిర్వహిస్తున్నారు. రన్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు(Traffice Restrictions) విధించారు. రన్ జరగనున్న పీపుల్స్ ప్లాజా, లేపాక్షి, ట్యాంక్ బండ్, పీవీఎన్ఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. సంజీవయ్య పార్కు నుంచి వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ క్రాస్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు. లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద మళ్లించి, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. ఇక్బార్ మీనార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. నెక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను షాదాన్ కాలేజ్, నిరంకారీ భవన్ మీదుగా మళ్లిస్తారు. ఇక రన్ కోసం వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్ ఎదురుగా, ఎంఎంటీఎస్ నెక్లెస్ రోడ్ స్టేషన్, లేక్ పోలీస్ స్టేషన్ పక్కన, ఎంఎస్ మక్తా, డాక్టర్ కార్ పార్కింగ్ వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.

షీ టీమ్స్ నిర్వహించే 2కే, 5కే రన్‌లో పాల్గొనాలనుకునేవారు తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలని రన్ నిర్వాహకులు కోరారు. శనివారం (మార్చి 5) సాయంత్రం 6గంటల లోపు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందులో పాల్గొనేవారికి నిర్వాహకులు టీషర్ట్ అందిస్తారన్నారు. రన్‌ను పూర్తి చేసినవారికి మెడల్‌తో పాటు బ్రేక్ ఫాస్ట్ కిట్ అందిస్తారని వెల్లడించారు.

Also Read

UP Elections 2022: ఆఖరి పంచ్‌ ఎవరిదో?.. యూపీ తుది విడత పోలింగ్‌పైనే అందరి దృష్టి..

CM KCR: ముక్త్‌భారత్‌పై కేసీఆర్ ఫోకస్.. రాజ్యాంగ ఉల్లంఘన, విద్యుత్ సంస్కరణలే అస్త్రం, త్వరలో దేశవ్యాప్త ఉద్యమం?

Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్‌లకు భారత్ వినతి.. మా విద్యార్థుల కోసం సేఫ్ కారిడార్..