Lady Barber: శ్రమిస్తూ.. విభిన్న రంగంలో రాణిస్తున్న మహిళ.. శభాష్ అనిపించుకుంటున్న సిద్ధిపేట వాసి
ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. ఇలాంటి సమాజంలో ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకుని అన్నిరంగాల్లో రాణిస్తున్నారు.
Telangana Lady Barber: సృష్టికి మూలం స్త్రీ. అసలు ఆడవారు లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ..ప్రస్తుత నవ సమాజంలో చీత్కరాలు ఎదుర్కొంటోంది. సాటి సభ్య సమాజాన్ని చూసి ఆమె కన్నీరు పెడుతుంది..! ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. ఇలాంటి సమాజంలో ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకుని అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. అయితే, మహిళలు(Women Power) అన్ని విషయల్లో ముందు ఉన్న కొన్ని రంగాల్లో మాత్రము వివిధ కారణాల దృష్ట్యా ముందుకు వెళ్లడం లేదు.. ఒకవేళ వెళ్తే సమాజం ఏం అనుకుంటుందో అనే అనుమానంతో అక్కడే ఆగిపోతున్నారు.. కానీ సిద్దిపేట(Siddipet) పట్టణానికి చెందిన ఓ మహిళ మాత్రం ఎవరి గురించి ఆలోచన చేయకుండా తాను అనుకున్న రంగంలో రాణిస్తుంది..
ఆకాశంలో సగం.. అవకాశంలో సగం.. అన్నట్లు అన్ని రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు మహిళలు. అయితే, మహిళలు కొన్ని రంగాల్లో ఇంకా రాణించలేక పోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం లింగ బేధం.. ఫలనా పని మగవారు మాత్రమే చేయాలి.. అనే విషయాన్ని కొంతమంది ఈ సమాజంపై రుద్దుతున్నారు.. అది ఇప్పటికి ఇంకా అలానే ఉండి పోయింది.. దీనితో కొంతమంది మహిళలకు కొన్ని పనులు చేయాలని ఉన్న వాటిని చేయలేకపోతున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఆలోచించింది సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కేసీఆర్ నగర్ లో నివసించే కొత్వాల లావణ్య అనే మహిళ.
సాధారణంగా మహిళలు బ్యూటీ ఫార్లర్ నడపడం చూసాం.. కానీ ఈ లావణ్య మాత్రం మగవారి హెయిర్ సెలూన్ నడుపుతుంది. పట్టణంలోని కేసీఆర్ నగర్ లో తన భర్త శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సెలూన్ షాపులో గత 4 నెలలుగా పనిచేస్తోంది. లాక్ డౌన్ సమయంలో ఈ పని నేర్చుకుంది లావణ్య. కుంటుంబ ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఈ వృత్తిని నేర్చుకోక తప్పలేదని చెబుతోంది లావణ్య. ప్రస్తుతం అన్ని రకాల కట్టింగ్, షేవింగ్, హెడ్ మసాజ్ లాంటివి చేస్తున్నానని తెలిపారు. సెలూన్ షాప్ లోకి వచ్చే కస్టమర్లు సైతం తనకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని అంటోంది. ఈ పని మొదలుపెట్టే ముందు ఎంతోమంది సూటి పోటి మాటలను విని తట్టుకున్నానని చెప్పారు. మగవారికి కట్టింగ్ చేయడం అనేది కేవలం మగవారు మాత్రమే చేయాలి అని.. ఆలాటింది నువ్వు ఎలా చేస్తావు అని లావణ్య ఎంతో మంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వారి మాటలను పట్టించుకోకుండ తాను నమ్మిన సిద్దాంతంతోనే ముందు అడుగు వేసింది.
తన కుటుంబ పోషణ కోసం తాను ఈ పనిని ఎంచుకున్న అని ఎవరు ఎన్ని ఎత్తి పొడుపు మాటలు అన్న వాటిని పక్కకు పెట్టి ముందుకు వెళ్ల అని చెబుతుంది లావణ్య. మగ వారి హెయిర్ సెలూన్‌లో పని చేసే పురుషులకు తానేం తక్కువ కాదని నిరూపిస్తుంది.. తాను చేస్తున్న పనిలోనే తనకు సంతోషం ఉందని చెబుతోంది.. లావణ్య భర్త కొత్వాల్ శ్రీనివాస్. 2018లో జరిగిన ఎన్నికల్లో మంత్రి హరీష్ రావుకి లక్ష మెజార్టీ రావాలని నెల రోజుల పాటు ఉచితంగా హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వహించడం విశేషం.
–— శివతేజ, టీవీ 9 ప్రతినిధి, మెదక్ జిల్లా.
Read Also…
BJP vs YCP: అనంతపురం ప్రోటోకాల్ రగడ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎదుటే ఎంపీ గోరంట్ల లడాయి!