ఇది టైప్ 2 డయాబెటిస్‌కు కూడా దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటే టైప్ 2 మధుమేహం వస్తుంది. కాలక్రమేణా ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, కంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఊబకాయం మధుమేహం ముప్పును 5-6 శాతం పెంచుతుంది. శరీర బరువును నియంత్రణలో ఉంచడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అలవాట్లవల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా నివారించవచ్చు.