- Telugu News Photo Gallery Cricket photos Australian cricket legend shane warne death at age 52 shilpa shetty shares some rare photos of shane warne
Shane Warne: షేన్ వార్న్‌తో శిల్పాశెట్టి అనుబంధం.. అరుదైన క్షణాల ఫోటోలు షేర్..
Shane Warne: షేన్ వార్న్ భారతదేశంలోని చాలా మంది ప్రముఖులతో పరిచయాలు కలిగి ఉన్నాడు. ఐపీఎల్ ద్వారా చాలామంది అభిమానులని సంపాదించుకున్నాడు.
Updated on: Mar 05, 2022 | 5:21 PM

షేన్ వార్న్ భారతదేశంలోని చాలా మంది ప్రముఖులతో పరిచయాలు కలిగి ఉన్నాడు. ఐపీఎల్ ద్వారా చాలామంది అభిమానులని సంపాదించుకున్నాడు. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కూడా షేన్ వార్న్‌తో సన్నిహితంగా మెలిగేవారు.

షేన్ వార్న్ మృతికి శిల్పాశెట్టి సంతాపం తెలిపారు. స్పిన్ దిగ్గజంతో కొన్ని అరుదైన క్షణాలను గుర్తుచేసే ఫోటోలను షేర్ చేశారు. షేన్ వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

షేన్ వార్న్ 52 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడనే సంగతి తెలిసిందే. షేన్‌వార్న్‌ని చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ఇష్టపడేవారు.

షేన్ వార్న్ మరణం హిందీ చిత్ర పరిశ్రమలో చాలా మందిని బాధించింది. అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి, వరుణ్ ధావన్, రణ్‌వీర్ సింగ్, షిబానీ దండేకర్, హుమా ఖురేషీతో సహా చాలా మంది ఆయనతో పరిచయం కలిగి ఉన్నారు.

'లెజెండ్స్ ఎప్పుడూ సజీవంగా ఉంటారు' అని షేన్ వార్న్‌తో కలిసి శిల్పాశెట్టి ఒక ఫోటోను షేర్ చేసుకుంది. "ఓం శాంతి’’ అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.



