AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్‌ తింటే అద్భుత ఫలితాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Paan‌ Benefits: తమలపాకులు తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని కొద్ది మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా పెళ్లయిన మగవారికి తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి.

Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్‌ తింటే అద్భుత ఫలితాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Pan
uppula Raju
|

Updated on: Mar 05, 2022 | 7:07 PM

Share

Paan‌ Benefits: తమలపాకులు తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని కొద్ది మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా పెళ్లయిన మగవారికి తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి. ప్రాచీన కాలంలో రాజులు, చక్రవర్తులు ప్రతిరోజు రాత్రి పాన్ తినేవారు. ఎందుకంటే వారికి పాన్‌ వల్ల కలిగే లాభాలు తెలుసు. లవంగాలు, సోంపు లేదా ఏలకులతో తినే పాన్ పురుషులకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. లైంగిక సమస్యలతో బాధపడేవారు ఇలాంటి పాన్ తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇది పురుషుల లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఇది లవంగం, ఫెన్నెల్, ఏలకుల కంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది పురుషులలో నపుంసకత్వము తగ్గిస్తుంది. టెస్టోస్టెరాన్, జననేంద్రియాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే మీ చేయి కట్‌ అయి మంటగా ఉంటే మీరు తమలపాకులను ఉపయోగించవచ్చు.

తమలపాకుల్లో ఉండే అనాల్జేసిక్ లక్షణాలు తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. దీని కోసం తమలపాకులను పేస్ట్‌లా చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఇది చర్మం లోపలికి వెళ్లి నొప్పి, మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కాకుండా తమలపాకులో యాంటీ-సెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అదే సమయంలో తమలపాకులు మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత తమలపాకు పాన్ తింటే హార్ట్ లో మంట, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. అందుకే చాలా ప్రాంతాల్లో తిన్న వెంటనే ఈ తమలపాకు పాన్ వేసుకుంటారు. తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఒక గ్లాసు నీళ్లను తీసుకుని అందులో తమలపాకును చిన్న చిన్నముక్కలుగా కట్‌ చేసి వేయాలి. వాటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం పరగడుపున తాగితే చాలా మంచిది.

LIC Policy: ప్రతి నెల రూ.51,000 పెన్షన్.. ఉన్నన్ని రోజులు భర్తకి.. ఆ తర్వాత భార్యకి..!

Shane Warne: షేన్ వార్న్‌తో శిల్పాశెట్టి అనుబంధం.. అరుదైన క్షణాల ఫోటోలు షేర్..

Vastu Tips: ఆ దిశలో బాత్రూమ్‌ ఉంటే అప్పుల భారం ఎక్కువ.. కారణం ఏంటంటే..?