LIC Policy: ప్రతి ఏటా రూ.51,000 పెన్షన్.. ఉన్నన్ని రోజులు భర్తకి.. ఆ తర్వాత భార్యకి పెన్షన్..!

LIC Saral Pension Scheme: ఈ రోజు మనం LIC సరళ పెన్షన్ పథకం గురించి తెలుసుకుందాం. ఇది భార్యభర్తలిద్దరికి ప్రయోజనకరంగా ఉంటుంది. మహిళా దినోత్సవం సందర్భంగా భర్తలు,

LIC Policy: ప్రతి ఏటా రూ.51,000 పెన్షన్.. ఉన్నన్ని రోజులు భర్తకి.. ఆ తర్వాత భార్యకి పెన్షన్..!
Money Recovery
Follow us

|

Updated on: Mar 05, 2022 | 11:49 PM

LIC Saral Pension Scheme: ఈ రోజు మనం LIC సరళ పెన్షన్ పథకం గురించి తెలుసుకుందాం. ఇది భార్యభర్తలిద్దరికి ప్రయోజనకరంగా ఉంటుంది. మహిళా దినోత్సవం సందర్భంగా భర్త, భార్యకి బహుమతిగా ఇవ్వవచ్చు.జూలై 1, 2021 నుంచి ఈ పాలసీ అమలులో ఉంది. ఈ పెన్షన్ ప్లాన్ చాలా సరళంగా ఉంటుంది. సరల్ పెన్షన్ ప్లాన్ అనేది తక్షణ యాన్యుటీ ప్లాన్. అంటే ప్లాన్‌ తీసుకున్నవెంటనే పెన్షన్ ప్రారంభమవుతుంది. అందుకే ఇమ్మీడియట్ పెన్షన్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. ఈ పెన్షన్ ప్రయోజనం 4 మోడ్‌లలో అందుబాటులో ఉంటుంది. మీకు ప్రతి నెలా పెన్షన్ కావాలంటే మీరు నెలవారీ విధానాన్ని ఎంచుకోవాలి. అదేవిధంగా మీకు మూడు నెలలకు త్రైమాసిక మోడ్, ఆరు నెలలకు అర్ధ-వార్షిక మోడ్, సంవత్సరానికి వార్షిక మోడ్‌ను ఎంచుకోవచ్చు. మీరు నెలవారీ మోడ్‌ని ఎంచుకుంటే ప్లాన్ తీసుకున్న 1 నెల తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది. అదేవిధంగా త్రైమాసిక, అర్ధ వార్షిక, సంవత్సరానికి నియమాలు ఉన్నాయి. ఈ ప్లాన్ ఒకే ప్రీమియం పెన్షన్ ప్లాన్. దీని కోసం ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది.

భార్యాభర్తల్లో ఎవరైనా పెన్షన్ పొందాలనుకుంటే 100% రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్‌తో లైఫ్ యాన్యుటీ ఎంపికను ఎంచుకోవాలి. ఈ పెన్షన్ ప్లాన్ ఎవరి పేరు మీద ఉంటుందో అతను జీవితాంతం స్థిరమైన పెన్షన్ పొందుతాడు. పెన్షనర్ మరణించిన తర్వాత పాలసీ తీసుకునే సమయంలో చెల్లించిన మొత్తం నామినీకి అందుతుంది. రెండో ఎంపికలో ఉమ్మడి జీవితం అంటే భార్యాభర్తలిద్దరికీ. ఇందులో పెన్షనర్ తన జీవితంలో ఎంత పెన్షన్ పొందుతాడో మరణించిన తర్వాత అతడి జీవిత భాగస్వామి కూడా పెన్షన్ లభిస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఈ లోకంలో లేనప్పుడు నామినీకి బేస్ ప్రైస్ చెల్లిస్తారు.

ఎవరు ప్లాన్ తీసుకోగలరు..

40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల లోపు వారు ఈ పింఛను పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. 60 ఏళ్ల రామయ్య 10 లక్షల హామీతో ఈ పెన్షన్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. రామయ్య వార్షిక పింఛను పొందే విధానాన్ని ఎంచుకుంటే అతను ప్రీమియంగా రూ.10,18,000 చెల్లించాలి. దీని ప్రకారం అతను జీవితాంతం ప్రతి ఏటా రూ. 51,650 పొందుతాడు. రామయ్య చనిపోయినప్పుడు అతని నామినీ లేదా చట్టపరమైన వారసుడికి రూ.10 లక్షలు తిరిగి చెల్లిస్తారు.

ఉమ్మడి పెన్షన్ ప్రకారం..

ఉమ్మడి పెన్షన్ ప్రకారం రామయ్య 10 సంవత్సరాల హామీ మొత్తం కోసం వార్షిక మోడ్‌ను ఎంచుకున్నాడు అనుకుందాం. ఏడాదికి ఒకసారి పెన్షన్ కావాలంటే రూ.10,18,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా రూ.51,150 పింఛను పొందుతాడు. రామయ్య చనిపోయాక అతని భార్యకు జీవితాంతం రూ.51,150 పెన్షన్ వస్తుంది. భార్యాభర్తలిద్దరూ చనిపోయినప్పుడు నామినీకి రూ.10 లక్షలు చెల్లిస్తారు.

Shane Warne: షేన్ వార్న్‌తో శిల్పాశెట్టి అనుబంధం.. అరుదైన క్షణాల ఫోటోలు షేర్..

Vastu Tips: ఆ దిశలో బాత్రూమ్‌ ఉంటే అప్పుల భారం ఎక్కువ.. కారణం ఏంటంటే..?

ఆ పొదుపు ఖాతాదారులకి హెచ్చరిక.. మార్చిలో ఈ పని చేయకపోతే పెనాల్టీలు భరించలేరు..!