Vastu Tips: ఆ దిశలో బాత్రూమ్‌ ఉంటే అప్పుల భారం ఎక్కువ.. కారణం ఏంటంటే..?

Vastu Tips: ప్రపంచంలో ఏ వ్యక్తి అప్పుల భారం కోరుకోడు. కానీ చాలాసార్లు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున అప్పులు చేయాల్సి వస్తుంది. ఇక వీటి నుంచి బయటపడటం ఎంత కష్టమో

Vastu Tips: ఆ దిశలో బాత్రూమ్‌ ఉంటే అప్పుల భారం ఎక్కువ.. కారణం ఏంటంటే..?
Vastu Tips
Follow us
uppula Raju

|

Updated on: Mar 05, 2022 | 4:34 PM

Vastu Tips: ప్రపంచంలో ఏ వ్యక్తి అప్పుల భారం కోరుకోడు. కానీ చాలాసార్లు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున అప్పులు చేయాల్సి వస్తుంది. ఇక వీటి నుంచి బయటపడటం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. అయితే వాస్తు దోషాలు కూడా అప్పుల బాధకు కారణం అవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిన్న చిన్న పనులు సరిచేస్తే అప్పుల బాధ తగ్గుతుంది. ఇల్లు లేదా దుకాణంలో లక్ష్మీదేవి, కుబేరుడి విగ్రహం ఉత్తర దిశలో ప్రతిష్టించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, తల్లి లక్ష్మి, ఉత్తరాది నుంచి వచ్చిన కుబేరుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దిక్కున లక్ష్మీదేవి, కుబేరుడి విగ్రహాలను ప్రతిష్టించి నిత్యం పూజించడం వల్ల అప్పుల బాధ తొలగిపోతుంది. కొన్ని ఇళ్లలో భోజనం చేసిన తర్వాత మురికి పాత్రలను అలాగే వదిలేస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్య్రం తాండవిస్తుంది. అలాగే ఇంట్లో ధన నష్టం కూడా జరుగుతుంది. డబ్బు ఉన్నా కూడా అదృష్టం వరించదు.

వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం ఎల్లప్పుడూ ఇల్లు లేదా దుకాణంలో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో అప్పుల భారం పెరగదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు రుణం తీసుకున్నట్లయితే లేదా దాని మొదటి వాయిదా మంగళవారం చెల్లించాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా అప్పుల బాధ నుంచి విముక్తులవుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇల్లు లేదా కార్యాలయంలో బాత్రూమ్ నైరుతి దిశలో ఉండకూడదు. ఈ దిశలో బాత్రూమ్ ఉండటం వల్ల అప్పుల పాలవుతారు. ఒకవేళ తప్పదంటే ఆ మూలలో ఉప్పుతో నిండిన గిన్నెను ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, వాస్తు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది.

PPF Account: పీపీఎఫ్ ఖాతా నిబంధనలలో మార్పులు.. తెలుసుకోపోతే పెద్ద నష్టం..!

ఆ పొదుపు ఖాతాదారులకి హెచ్చరిక.. మార్చిలో ఈ పని చేయకపోతే పెనాల్టీలు భరించలేరు..!

Driving License: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గమనించండి..!