PPF Account: పీపీఎఫ్ ఖాతా నిబంధనలలో మార్పులు.. తెలుసుకోపోతే పెద్ద నష్టం..!
PPF Account: మీరు పీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి. ప్రభుత్వం ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇది పెట్టుబడిదారులపై ప్రత్యక్ష
PPF Account: మీరు పీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి. ప్రభుత్వం ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇది పెట్టుబడిదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. డిసెంబర్ 12, 2019 తర్వాత ఒక వ్యక్తి ప్రారంభించిన రెండు పీపీఎఫ్ ఖాతాలని విలీనం చేయడం సాధ్యం కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మెమోరాండం (ఓఎం) కూడా జారీ చేసింది. పీపీఎఫ్ ఖాతాలను నిర్వహిస్తున్న సంస్థలు డిసెంబర్ 12న తర్వాత ఓపెన్ చేసిన ఖాతాలని విలీనం చేయమని అభ్యర్థనలు పంపకూడదని మెమోరాండమ్‌లో ఉంది. పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన సర్క్యులర్‌లో డిసెంబర్ 12, 2019 లేదా తర్వాత తెరిచిన రెండు లేదా అంతకంటే ఎక్కువ PPF ఖాతాలలో ఒక ఖాతా మాత్రమే యాక్టివ్‌గా ఉంటుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాతాలు క్లోజ్ చేస్తారు. అలాగే క్లోజ్ చేసిన ఖాతాకి వడ్డీ కూడా చెల్లించరు.
ఇలా అర్థం చేసుకోండి..
ఉదాహరణకు మీరు ఒక PPF ఖాతాను జనవరి 2014లో, మరొకటి ఫిబ్రవరి 2020లో తెరిచినట్లయితే.. ఫిబ్రవరి 2020 నాటి మీ PPF ఖాతా మూసివేస్తారు. ఈ ఖాతాపై ఎలాంటి వడ్డీ లభించదు. అదేవిధంగా మీరు మొదటి ఖాతాను జనవరి 2014లో, రెండో ఖాతాను ఫిబ్రవరి 2017లో తెరిస్తే ఈ రెండూ మీ అభ్యర్థనపై విలీనం చేస్తారు. పీపీఎఫ్ ఖాతాలో తక్కువ అమౌంట్‌తో ఎక్కువ బెనిఫిట్స్ సాధించవచ్చు. ఈ పథకంలో ఎలాంటి రిస్క్ ఉండదు. ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పీపీఎఫ్ నుంచి మెరుగైన రాబడులు పొందవచ్చు. ఇందులో మీ డబ్బు కూడా పూర్తిగా సురక్షితం. భవిష్యత్తు కోసం పెద్ద కార్పస్‌ను రెడీ చేసుకోవచ్చు. ఈ స్కీం ద్వారా మీరు మెచ్యురిటీ లోపు రూ.1 కోటి వరకు సంపాదించవచ్చు. మీరు ఈ పథకాన్ని పోస్టాఫీసు లేదా ప్రభుత్వ బ్యాంకు నుంచి తీసుకోవచ్చు.