IND W vs PAK W: సూపర్ సండే.. భారత్, పాకిస్తాన్ మధ్య రసవత్తర పోరు.. రికార్డులు బ్రేకయ్యేనా..!
IND W vs PAK W: న్యూజిలాండ్‌లో ఐసీసీ మహిళల ప్రపంచకప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం రసవత్తర పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్,
IND W vs PAK W: న్యూజిలాండ్‌లో ఐసీసీ మహిళల ప్రపంచకప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం రసవత్తర పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపనుంది. ప్రతి క్రికెట్ అభిమాని భారత్-పాక్ పోరు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ రెండు దేశాలకు ఓడిపోవడం అంటే ఏంటో బాగా తెలుసు. కాబట్టి మ్యాచ్ హోరాహోరీగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత్‌కు కలిసొచ్చే విషయం ఏంటంటే పాకిస్తాన్‌తో తలపడే ముందు ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉండటమే కాకుండా మంచి ఫామ్‌లో ఉన్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ తిరిగి ఫామ్‌లోకి రావడంతో టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఆమె బహుశా 4వ నంబర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇది ఆమెకు ఇష్టమైన స్థానం. అంతేకాకుండా వార్మప్ మ్యాచ్‌లో సెంచరీ కూడా చేసింది. పాకిస్థాన్‌పై అదే ఫామ్‌ను కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది.
మ్యాచ్‌కు ముందు కెప్టెన్ల సమావేశం..
మిథాలీ రాజ్ టీమ్‌కి పోటీగా పాక్ జట్టు కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంది. వారు ఓడిపోవడానికి అస్సలు సిద్దంగా లేరు. గెలవడానికి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. మ్యాచ్‌కు ఒకరోజు ముందు భారత్, పాకిస్థాన్ కెప్టెన్లు కలుసుకుని ఫొటోలు కూడా దిగారు. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో తలపడక ముందు భారత్, పాకిస్థాన్‌లు వన్డేల్లో 10 సార్లు పోటీ పడ్డాయి. ఇందులో అన్ని మ్యాచ్‌ల్లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ 10 వన్డేల్లో 3 మ్యాచ్‌లు ప్రపంచకప్ పిచ్‌పైనే జరిగాయి. మిథాలీ రాజ్ కెప్టెన్సీలో భారత్ 10 వన్డేల్లో 9 విజయాలను నమోదు చేసింది. అదే సమయంలో ఝులన్ గోస్వామి సారథ్యంలో జరిగిన ఏకైక వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య జరిగే 11వ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.
Pakistan and India captains exchanging greetings on the eve of their match. How excited are you? #CWC22 #BackOurGirls pic.twitter.com/fTEawDeiUI
— Pakistan Cricket (@TheRealPCB) March 5, 2022