IND vs SL: జడ్డూ ఖాతాలో అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ‘సర్ జడేజా’..
Ravindra Jadeja: మొహాలీ టెస్టులో శ్రీలంకతో జరుగుతున్న రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 574 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా తన పేరిట ఓ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
మొహాలీలో శ్రీలంక(IND vs SL)తో జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు భారత్ 574 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 574 పరుగులు చేసింది. ఈ సమయంలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అజేయంగా 175 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ అయ్యేలోగా డబుల్ సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ, సర్ జడేజా పేరిట ఓ ప్రత్యేక ప్రపంచ రికార్డు నమోదైంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 228 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ కారణంగా జడేజా ప్రపంచ రికార్డు(World Record) సృష్టించాడు. ఆరో వికెట్ లేదా అంతకంటే తక్కువ ఆటగాళ్లతో ఒక ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీల భాగస్వామ్యాలు సాధించిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. జడేజా కంటే ముందు ఏ ఆటగాడు ఈ ఘనత సాధించలేకపోయాడు.
మొహాలీ టెస్టులో రిషబ్ పంత్‌తో కలిసి ఆరో వికెట్‌కు రవీంద్ర జడేజా 104 పరుగులు చేశాడు. ఆ తరువాత రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి 7వ వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, ఈ సమయంలో అశ్విన్ 61 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. 82 బంతులు ఎదుర్కొంటూ 8 ఫోర్లు కూడా బాదాడు. జడేజా 9వ వికెట్‌కు మహమ్మద్ షమీతో కలిసి 103 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యంలో షమీ 20 పరుగులు మాత్రమే చేశాడు.
మొహాలీ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జడేజా 175 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ సెంచరీ చేయడంలో విఫలమై 96 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 29 పరుగుల వద్ద ఔట్ కాగా, విరాట్ కోహ్లీ 45 పరుగులు చేశాడు. హనుమ విహారి 58 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.