ICC Women World Cup 2022: చివరి ఓవర్‌లో హైడ్రామా.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

Australia Vs England: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలి అడుగు ఘనంగా వేసింది.

ICC Women World Cup 2022: చివరి ఓవర్‌లో హైడ్రామా..  థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా
Icc Women’s World Cup Australia Vs England
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Mar 08, 2022 | 3:02 PM

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌(ICC Women’s World Cup)2022లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌(Australia vs England)ల మధ్య జరిగిన పోరులో ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ముగిసంది. చివరి ఓవర్లో ఫలితం (Last Over) వచ్చింది. అక్కడ ఆస్ట్రేలియా తమ విజయానికి స్క్రిప్ట్ రాయడంతో ఇంగ్లండ్ మహిళల జట్టు టోర్నీలో విజయాన్నందుకుంది. ఇంగ్లండ్‌ విజయం సాధించాలంటే చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, చివరి 6 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ చివరి ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి ఓడిపోయింది.

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 12వ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆదేశించింది. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 310 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి ఓటమి పాలైంది.

అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హన్స్, లానింగ్.. ఆస్ట్రేలియా తరుపున ఓపెనర్ రేచెల్ హైన్స్ అద్భుత సెంచరీతో 131 బంతుల్లో 130 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆమె14 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. హెయిన్స్, లానింగ్‌తో కలిసి రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యంలో మెగ్ లానింగ్ 110 బంతుల్లో 86 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.

వీరిద్దరు కాకుండా బెత్ మూనీ 19 బంతుల్లో 27 పరుగులు చేసింది. అలిస్సా పెర్రీ 5 బంతుల్లో 14 పరుగులు చేసింది. ఈ ఇద్దరు బ్యాటర్స్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌ తరఫున నేట్‌ సీవర్‌ ఆస్ట్రేలియా తరఫున 2 వికెట్లు పడగొట్టాడు.

311 పరుగుల లక్ష్యం.. ఇంగ్లండ్ ముందు 311 పరుగుల భారీ లక్ష్యం ఉంది. ఈ లక్ష్యం ముందు ఖాతా తెరవకుండానే తొలి దెబ్బ తగిలినా.. ఆ తర్వాత రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ భాగస్వామ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ సహకారం 40 పరుగులు అందించింది.

బంతితో రెండు వికెట్లు తీసిన నేట్ శివర్ 109 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. కేవలం 85 బంతుల్లోనే ఈ పరుగులు చేయడం విశేషం. బ్యూమాంట్ 82 బంతుల్లో 74 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లు విజయంపై ఆశను పెంచాయి. అయితే లోయర్ ఆర్డర్ బ్యాటర్ల నుంచి ప్రత్యేక సహకారం అందించకపోవడంతో ఇంగ్లండ్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా తరఫున అలనా కింగ్ 3 వికెట్లు తీసి విజయవంతమైన బౌలర్‌గా నిలిచింది.

Also Read: Ranji Trophy: 12 ఇన్నింగ్స్‌లు.. 5 సెంచరీలు.. ప్రతిదీ 150 ప్లస్సే.. రంజీలో తగ్గేదేలే అంటోన్న ముంబై ప్లేయర్..

Women’s World Cup 2022: 9 టోర్నీలు.. 2 ఫైనల్స్.. మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..