Driving License: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గమనించండి..!
Driving License: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తున్నారా.. అయితే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. గతంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారు చాలా
Driving License: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తున్నారా.. అయితే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. గతంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారు చాలా మందే ఉండేవారు. కానీ మారిన ఈ రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అయిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు కఠినంగా ఉన్నాయి. ఒకవేళ నడిపితే మాత్రం అది చట్ట విరుద్ధం అవుతుంది. భారీగా జరిమానా వేస్తారు. అందుకే వాహనాలు నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం తప్పనిసరి. ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇప్పుడు సులభతరంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలని మార్చింది. అయినా ఈ విషయం చాలా మందికి తెలియడం లేదు. ఇంకా పాత పద్దతిలోనే డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలా ఆలోచిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రజలు ఇకపై ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (RTO) సందర్శించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్‌ను చాలా సులభతరం చేసింది.
కొత్త రూల్ ప్రకారం.. ఇప్పుడు మీరు RTO ఆఫీసు వద్దకు వెళ్లి ఎలాంటి డ్రైవింగ్ పరీక్ష చేయవలసిన అవసరం లేదు. ఈ నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. మారిన నిబంధనలు డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త మార్పు వల్ల డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న కోట్లాది మందికి ఊరట లభించినట్లయింది. డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి RTO వద్ద పరీక్ష కోసం వేచి ఉన్న దరఖాస్తుదారులందరు ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ పాఠశాలలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం నమోదు చేసుకోవాలి. అక్కడ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ నుంచి శిక్షణ పొందాలి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడు దరఖాస్తుదారులకు పాఠశాల ద్వారా సర్టిఫికేట్ అందుతుంది. ఈ సర్టిఫికేట్ ఆధారంగా దరఖాస్తుదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు.