Grapes Juice: ద్రాక్షరసం తాగుతూ ఎప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవద్దు.. ఎందుకంటే..?
Grapes Juice: చాలామంది ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు జ్యూస్‌లు తీసుకుంటారు. కానీ ఇది ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుంది. ఔషధాలు ఎప్పుడు పండ్ల రసాలతో తీసుకోకూడదు.
Grapes Juice: చాలామంది ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు జ్యూస్‌లు తీసుకుంటారు. కానీ ఇది ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుంది. ఔషధాలు ఎప్పుడు పండ్ల రసాలతో తీసుకోకూడదు. మీకు అలాంటి అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఎందుకంటే జ్యూస్‌తో పాటు ట్యాబ్లెట్లు వేసుకుంటే వాటి ప్రభావం తగ్గే అవకాశాలున్నాయి. అంతేకాదు ఒక్కోసారి అలర్జీ కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎప్పుడైనా ఔషధాలు ద్రాక్ష, నారింజ, ఆపిల్ జ్యూస్‌లతో తీసుకోకూడదు. ద్రాక్ష రసం రక్తప్రవాహంలోకి వెళ్లి ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అందుకే రక్తపోటు, గుండె వ్యాధులు ఉన్నవారు ద్రాక్ష రసంతో పాటు ట్యాబ్లెట్లు వేసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నారింజ, యాపిల్, ద్రాక్ష రసాలతో క్యాన్సర్ మందులని తీసుకుంటే వాటి ప్రభావం తగ్గుతుందని ఒక పరిశోధనలో తేలింది. ద్రాక్ష రసంతో ఔషధం తీసుకున్న తర్వాత సగం ఔషధ ప్రభావమే ఉంటుంది. రసాలు ఔషధం శోషణ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఔషధాలను నీటితో తీసుకుంటే మేలు. అంతేకాదు సురక్షితం కూడా. కొద్దిపాటి నీళ్లతో ట్యాబ్లెట్లు వేసుకుంటే అవి శరీరంలో సరిగా కరగదు. అందుకే ఎక్కువ నీటితో తీసుకుంటే అవి సులభంగా కరిగిపోతాయి.
చల్లటి నీటితో ఔషధాలను తీసుకోవడం కూడా మంచిదికాదని గుర్తుంచుకోండి. చల్లటి డ్రింక్స్‌తో ట్యాబ్లెట్లు తీసుకున్నవారిలో అవి విచ్ఛిన్నం కావడానికి సుమారు 40 నిమిషాలు పడుతుంది. అంటే అది గది ఉష్ణోగ్రత కలిగిన నీటితో తీసుకునే మాత్ర విచ్ఛిన్నత కంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. మనం మింగే మాత్ర కాలేయం గుండా వెళ్తుంది. రక్త ప్రవాహంలోకి ప్రవేశించే ముందు కడుపులోని ఆమ్లాల ద్వారా విచ్ఛిన్నమవుతుంది. అదే కూల్ డ్రింక్స్, లేదా కూల్ వాటర్‌తో టాబ్లెట్ మింగితే ఆమ్లాలతో కలిసే ప్రక్రియ ఆలస్యమవుతుంది.