Health: గ్రీన్‌ టీ మంచిదని అతిగా తాగుతున్నారా.? అయితే మొదటికే మోసం జరుగుతుంది జాగ్రత్త..

Health: గ్రీన్‌ టీ (Green Tea) తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైద్యులు కూడా గ్రీన్‌ టీని సిఫార్స్‌ చేస్తుంటారు. ముఖ్యంగా శరీరంలో కొవ్వును తగ్గించుకోవాలనుకునే వారికి..

Health: గ్రీన్‌ టీ మంచిదని అతిగా తాగుతున్నారా.? అయితే మొదటికే మోసం జరుగుతుంది జాగ్రత్త..
Green Tea Side Effects
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 04, 2022 | 7:00 AM

Health: గ్రీన్‌ టీ (Green Tea) తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైద్యులు కూడా గ్రీన్‌ టీని సిఫార్స్‌ చేస్తుంటారు. ముఖ్యంగా శరీరంలో కొవ్వును తగ్గించుకోవాలనుకునే వారికి గ్రీన్‌ టీని తీసుకోమని సూచిస్తుటారు. షుగర్ ఉండదు, ఆర్యోగానికి మేలు చేసే హెర్బల్‌ ప్రొడక్ట్స్‌ ఉండడంతో గ్రీన్‌ టీ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అయితే అతి ఏదైనా అనర్థమే అన్నట్లు గ్రీన్‌ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పడంలో ఎంత నిజం ఉందో.. అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

రోజులో 3 కప్పుల వరకు గ్రీన్‌ టీ తీసుకుంటే పెద్దగా ప్రమాదమేమి లేకపోయినా.. అంతకుమించి తీసుకుంటే మాత్రం ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇంతకీ గ్రీన్‌ టీని అతిగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  1.  గ్రీన్‌టీ అతిగా తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. లెక్కకు మంచి గ్రీన్‌ టీ తాగడం వల్ల శరీరంలో రక్తం పరిమాణం తగ్గుతుందని సూచిస్తున్నారు.
  2.  ఇక గ్రీన్‌ టీని లెక్కకు మించి తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణాశయంలో అసౌకర్యం కలుగుతుంది. గ్యాస్‌, అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
  3. గ్రీన్‌ టీ అతిగా తీసుకోవడం వల్ల తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
  4.  కొందరిలో గ్రీన్‌ టీని అతిగా తాగడం వల్ల తల తిరగడం, వికారం వంటి సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా లివర్‌పై కూడా చెడు ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి.
  5. ఇక గ్రీన్‌ టీలో ఉండే కెఫిన్ అడ్రినల్ గ్రంథులను ఉత్తేజపరుస్తుంది, ఇది కార్టిసాల్, ఆడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది రక్తపోటుకు దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి హృద్రోగులు గ్రీన్‌ టీకి దూరంగా ఉండడమే మేలు.
  6.  ఉదయం పరగడుపున గ్రీన్‌ టీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు గ్రీన్‌ టీని సాయంత్రం మాత్రమే తీసుకోవాలి.

Also Read: TISS Mumbai Jobs 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. టిస్‌ ముంబాయిలో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..అర్హతలివే!

Amitabh Bachchan-Prahas: ప్రభాస్ నుంచి చాలా నేర్చుకోవాలి… డార్లింగ్‌ను ఆకాశానికెత్తిన బిగ్ బీ.. వైరల్ అవుతున్న వీడియో..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!