Diabetes: మధుమేహ బాధితులు అలర్ట్‌.. పరగడుపున షుగర్ లెవల్స్‌ ఎందుకు పెరుగుతాయో తెలుసా..?

Diabetes: భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉంటారు. ఇది అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది. గుండె, మూత్రపిండాలు, మెదడు, చర్మంపై లోతైన ప్రభావం ఉంటుంది.

Diabetes: మధుమేహ బాధితులు అలర్ట్‌..  పరగడుపున షుగర్ లెవల్స్‌ ఎందుకు పెరుగుతాయో తెలుసా..?
మధుమేహం: సోయాబీన్‌ను ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఒక్కోసారి మీరు దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులుగా కూడా మారవచ్చు.
Follow us
uppula Raju

|

Updated on: Mar 03, 2022 | 9:12 PM

Diabetes: భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉంటారు. ఇది అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది. గుండె, మూత్రపిండాలు, మెదడు, చర్మంపై లోతైన ప్రభావం ఉంటుంది. ఇలా జరగకూడదంటే మధుమేహ రోగులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలి. సాధారణంగా ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కానీ ఒక్కోసారి పరగడుపున కూడా రక్తంలో చక్కెర పెరగడం గమనించవచ్చు. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హార్మోన్లలో మార్పు కారణంగా పరగడుపున చక్కెర స్థాయి పెరుగుతుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు హార్మోన్లను నియంత్రించడానికి శరీరం ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. రాత్రిపూట అధిక కార్బోహైడ్రేట్ ఆహారం తీసుకోవడం వల్ల ఉదయం రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మీరు మధుమేహ రోగి అయితే సరైన సమయంలో ఔషధం తీసుకోవాలని గుర్తుంచుకోండి.

లేదంటే మరుసటి రోజు ఉదయం రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మీరు నిద్రపోయే ముందు ఇన్సులిన్ తీసుకుంటే ఉదయం రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిని రీబౌండ్ హైపర్గ్లైసీమియా అంటారు. పరగడుపున రక్తంలో చక్కెర స్థాయి 70 నుంచి 100 mg/dl ఉంటే ఆందోళన చెందాల్సిన పని లేదు. అలాగే 100 నుంచి 125 mg/dl ఉంటే అది డయాబెటీస్ బార్డర్‌ లో ఉన్నట్లు. ఇంతకంటే ఎక్కువ షుగర్ కలిగి ఉంటే డయాబెటిస్ కేటగిరీలోకి వస్తుంది. శరీరంలో ప్రతి కణానికి గ్లూకోజ్‌ అవసరం.

మనం తీసుకున్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి రక్తం నంచి ఒంట్లోని కణాలన్నింటికి సరఫరా అవుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను కణాల చక్కగా ఉపయోగించుకోవాలంటే అందుకు ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ అవసరం. ఈ హార్మోన్‌ను మన శరీరంలోని క్లోమం ఉత్పత్తి చేస్తుంది. కానీ కొందరిలో ఈ క్లోమం ఇన్సులిన్‌ను సరిగా ఉత్పత్తి చేయలేక, మరికొందరిలో ఉత్పత్తి చేసినా అది సమర్ధవంతంగా పని చేయదు. దీంతో రక్తంలో గ్లూకోజ్‌ నిలిచిపోతుంది. దీన్నే మధుమేహం (చక్కెరవ్యాధి)గా పిలుస్తారు. పరగడుపున పరీక్ష చేస్తే 100 మి.గ్రా చక్కెర శాతం ఉండాలి. ఆహారం తిన్న తర్వాత 160 మి.గ్రా ఉండాలి. అంతకుమించితే షుగర్‌ వచ్చినట్లు నిర్ధారిస్తారు.

100వ టెస్ట్‌లో కోహ్లీ సెంచరీ చేయాలి.. డిమాండ్ చేస్తున్న మాజీ సొగసరి బ్యాట్స్‌మెన్..!

ఆడపిల్లల చదువు, పెళ్లి కోసం బాధపడవద్దు.. ఈ స్కీంలో పెట్టుబడి పెడితే చాలు..!

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రిటైర్మెంట్ వయసు, పెన్షన్ పెంచే యోచనలో కేంద్రం..!