ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రిటైర్మెంట్ వయసు, పెన్షన్ పెంచే యోచనలో కేంద్రం..!

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రిటైర్మెంట్ వయసు, పెన్షన్ పెంచే యోచనలో కేంద్రం..!
Pm Economic Advisory Commit

Retirement Age: కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు, పెన్షన్ మొత్తాన్ని పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను

uppula Raju

|

Mar 03, 2022 | 6:04 PM

Retirement Age: కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు, పెన్షన్ మొత్తాన్ని పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను ఆర్థిక సలహా కమిటీ ప్రధానమంత్రికి పంపింది. ఇందులో దేశంలోని వ్యక్తుల పని వయస్సు పరిమితిని పెంచడంపై చర్చ జరిగింది. దీంతో పాటు దేశంలో రిటైర్మెంట్‌ వయస్సును పెంచడంతో పాటు, యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్‌ను కూడా ప్రారంభించాలని ప్రధాని ఆర్థిక సలహా కమిటీ తెలిపింది. కమిటీ నివేదిక ప్రకారం.. ప్రతి నెల ఉద్యోగులకు కనీసం 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. దేశంలోని సీనియర్ సిటిజన్ల భద్రత కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలి. పని చేసే జనాభా పెరగాలంటే రిటైర్మెంట్‌ వయస్సును పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సామాజిక భద్రతా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి ఇది చేయవచ్చని సూచించింది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల నైపుణ్యాభివృద్ధి గురించి కూడా చర్చ జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి విధానాలను రూపొందించాలని నివేదికలో పేర్కొన్నారు.

ఈ ప్రయత్నంలో అసంఘటిత రంగంలో నివసిస్తున్నవారు, మారుమూల ప్రాంతాలు, శరణార్థులు, శిక్షణ పొందే స్తోమత లేని వలసదారులు కూడా ఉండాలని సూచించారు. అయితే వారికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రపంచ జనాభా ప్రాస్పెక్టస్ 2019 ప్రకారం.. 2050 నాటికి భారతదేశంలో దాదాపు 32 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉంటారని అంచనా. అంటే దేశ జనాభాలో దాదాపు 19.5 శాతం మంది రిటైర్డ్ కేటగిరీలోకి వెళ్తారు. 2019 సంవత్సరంలో భారతదేశ జనాభాలో 10 శాతం లేదా 140 మిలియన్ల మంది సీనియర్ సిటిజన్ల కేటగిరీలో ఉన్నారు.

BCCI: ఈ ఇద్దరు ఆటగాళ్లని అదృష్టం వరించింది.. కొత్త కాంట్రాక్ట్‌లో ప్రమోషన్ దక్కింది..

Viral Photos: బాయ్‌ఫ్రెండ్‌ కోసం వెతుకుతున్న 3 అడుగుల మోడల్.. పెళ్లి చేసుకొని సెటిల్‌ అవుతుందట..!

IND vs SL: భారత్, శ్రీలంక తొలి టెస్టు చాలా స్పెషల్.. 3 కారణాల వల్ల చరిత్రలో నిలుస్తుంది..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu