Anand Mahindra : ఉక్రెయిన్‌లో ఇండియన్ స్టూడెంట్స్ వెతలు.. చలించిన ఆనంద్ మహీంద్ర.. సంచలన నిర్ణయం!
ఉక్రెయిన్ ఉడికిపోతుంది.. రష్యా దాడులతో ఉక్రెయిన్ అతకుతలం అయిపోతుంది. సైన్యంతో ఉక్రెయిన్ ఫై విరుచుకుపడుతుంది రష్యా.
Anand Mahindra : ఉక్రెయిన్( Ukraine) ఉడికిపోతుంది.. రష్యా దాడులతో ఉక్రెయిన్ అతకుతలం అయిపోతుంది. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అక్కడి ప్రజలు. సైన్యంతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతుంది రష్యా. ఈ యుద్ధంలో ఎంతో మంది సైనికులతోపాటు సామాన్యులు కూడా ప్రాణాలు విడిచారు. రెండు దేశాలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా యుద్దానికి కాలుదువ్వుతున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర(Anand Mahindra) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఆయన సిద్ధం అయ్యారు. భారతీయులు ఎక్కువగా మెడిసన్ కోసం ఉక్రెయిన్ కు వెళ్తుంటారు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న మన దేశ విద్యార్థులను ఇండియాకు తరలిస్తున్నారు. విద్యార్థులను తరలించేందుకు ఆపరేషన్ గంగన్ ను ప్రభుత్వం చేపట్టింది.
ఈ నేపథ్యంలో మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ నిర్మించాలని మహేంద్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలంటూ మహీంద్రా యూనివర్సిటీ బాధ్యులకు సూచనలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ఆనంద్ మహీంద్రా. మన దేశంలో మెడికల్ కాలేజీలు లేవా.. ? ఎందుకు ఇంత మంది మెడిసన్ చదివేందకు వేరే దేశాలకు వెళ్తున్నారు.? ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పెట్టేందుకు అవకాశం ఉందా? అంటూ టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నానిని ఆదేశించారు . ఇప్పుడు ఆనంద్ మహేంద్ర ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ మన దగ్గర మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే ఎక్కడ చేస్తారు అన్నది ఇప్పుడు చర్చాంశం గా మారింది. అయితే మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఉంది. దాంతో మెడికల్ కాలేజ్ కూడా హైదరాబాద్ లోనే ఏర్పటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
I had no idea that there was such a shortfall of medical colleges in India. @C_P_Gurnani could we explore the idea of establishing a medical studies institution on the campus of @MahindraUni ? https://t.co/kxnZ0LrYXV
— anand mahindra (@anandmahindra) March 3, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :