CM KCR Delhi Tour: ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌తో బీజేపీ ఎంపీ భేటీ.. మతలబు అదేనా?

సామాజిక న్యాయం, సమానత్వాన్ని సాధించేందుకు అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

CM KCR Delhi Tour: ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌తో బీజేపీ ఎంపీ భేటీ.. మతలబు అదేనా?
Cm Kcr
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 03, 2022 | 4:00 PM

Telangana CM KCR Delhi Tour: దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(BJP) పాలనపై ప్రాంతీయ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వాన్ని సాధించేందుకు అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్(CM KCR) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జాతీయ స్థాయిలో పార్టీల నేతలు, పౌర సమాజ సభ్యలు, భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు ఉమ్మడి వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్. ఈ లక్ష్యాలను సాధించే దిశగా అన్ని పార్టీల, వివిధ ప్రజా సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుసుకున్న కేసీఆర్.. ఇవాళ ఢిల్లీ(Delhi) పర్యటనలో ప్రముఖులతోనూ భేటీ అవుతున్నారు. ఈక్రమంలో గురువారం ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

తెలంగాణాలో టీఆర్ఎస్ బీజేపీ ఉప్పు నిప్పులా మండిపోతుంటే ఢిల్లీలో మాత్రం సీఎం కేసీఆర్‌ను బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కలుసుకున్నారు. ఇటు సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అలాగే స్వపార్టీ మీదనే బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కేంద్రాన్ని అనేక అంశాల్లో వ్యతిరేకిస్తుంటారు. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంపీగా ఏప్రిల్ 24తో సుబ్రమణ్య స్వామి పదవీ కాలం ముగుస్తుంది. ఈ క్రమంలో కేంద్రాన్ని వ్యతిరేకించే సీఎం కేసీఆర్‌తో ఆయన భేటీ కావటంతో ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి కేసీఆర్ తో భేటీ కావటం మరింత ప్రాధాన్యతకు సంతరించుకుంది. భేటీ కేసీఆర్ ను బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తో పాటు బికేయు రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ సహా పలువురు పలువురు జాతీయ నేతలు కలిశారు. వారి మధ్య గంటన్నరకు పైగా భేటీ అయ్యి కీలక అంశాలపై చర్చించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ 23 లో ఉన్న కేసీఆర్ నివాసంలో కేసీఆర్ ను వీరు సమావేశమయ్యారు. బీజేపీ వ్యతిరేక కూటమి కి ఏర్పాట్లు జరుగుతున్న వేళ కేసీఆర్ సుబ్రమణ్య స్వామి సహా జాతీయ నేతలతో సమావేశమైన కేసీఆర్ జాతీయ రాజకీయ అంశాలు, బీజేపీ విధానాలు,ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, రైతు ఉద్యమం లో చనిపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వ పరిహారం అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

పీపుల్స్ ఫ్రంట్ అని సీఎం కేసీఆర్ చెబుతున్న థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు లో భాగంగా కేసీఆర్ ఎన్డీయేతరు నాయకులను వరసగా కలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతోనూ మంతనాలు జరుపుతున్నారు కేసీఆర్. అటు మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కూడా కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని కలువనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ ని కలిసేందుకు జాతీయ నాయకులు క్యూ కడుతున్నారు. దీంట్లో భాగంగానే ఇవాళ వారణాసిలో బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అక్కడికి కేసీఆర్‌ కూడా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ నేతల వరుస భేటీలు కీలకంగా మారాయి.

Read Also… Mandamus: కంటిన్యూస్ మాండమస్ అంటే ఏమిటి.. దీన్ని కోర్టు ఏ సమయాల్లో ఉపయోగిస్తుంది?