- Telugu News Photo Gallery Cricket photos From virat kohli 100th test to captain rohit sharma 1st test india vs sri lanka mohali test known for 3 reason
IND vs SL: భారత్, శ్రీలంక తొలి టెస్టు చాలా స్పెషల్.. 3 కారణాల వల్ల చరిత్రలో నిలుస్తుంది..
IND vs SL: భారత్-శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. మొహాలీ వేదికగా ఇరు దేశాల మధ్య తొలి టెస్టు జరగనుంది.
Updated on: Mar 03, 2022 | 3:59 PM

భారత్-శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. మొహాలీ వేదికగా ఇరు దేశాల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రాత్మక టెస్టును మరింత ప్రత్యేకంగా నిర్వహించేందుకు చివరి నిమిషంలో 50 శాతం మంది ప్రేక్షకులను కూడా స్టేడియంలోకి అనుమతించారు.

విరాట్ కోహ్లికి 100వ టెస్టు: మొహాలీ టెస్టుపై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయంటే కారణం అది విరాట్ కోహ్లీకి 100వ టెస్టు కావడమే. అతను గత ఆదివారం నుంచి మొహాలీ నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టు: వైట్ బాల్ క్రికెట్‌లో రోహిత్ తన కెప్టెన్సీ ట్రైలర్‌ను చూపించాడు. అయితే రెడ్ బాల్ క్రికెట్‌లో కెప్టెన్‌గా ఇది అతనికి తొలి టెస్టు. ఇందులో విజయాన్ని నమోదు చేసినా అది రికార్డే అవుతుంది.

శ్రీలంక 300వ టెస్టు: మొహాలీలో దిగిన వెంటనే శ్రీలంక ఖాతాలో ఓ ఘనత చేరిపోతుంది. ఇది శ్రీలంకకి 300వ టెస్టు. దిముత్ కరుణరత్నే ఇది జరుగుతుంది.



