uppula Raju |
Updated on: Mar 02, 2022 | 9:27 PM
ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంతలో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి పిడుగులాంటి వార్త వెలువడింది.
వెస్టిండీస్‌తో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో దీపక్ చాహర్ గాయపడ్డాడు. కండరాలు పట్టేయడంతో మైదానం నుంచి వెళ్లిపోయాడు. గాయం కారణంగా శ్రీలంకతో జరిగే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
ఈ సమస్య నుంచి కోలుకోవడానికి చాలా వారాలు పడుతుంది. ఎక్కువ విశ్రాంతి అవసరం. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. దీపక్ చాహర్ కోలుకుంటేనే ఐపీఎల్‌లో పాల్గొంటాడు.
క్రిక్ ఇన్ ఫో డేటా ప్రకారం.. ఐపీఎల్ ప్రారంభం నాటికి దీపక్ చాహర్ కోలుకోడం అనుమానమే. కాబట్టి CSK జట్టు ప్రారంభ మ్యాచ్‌ల నుంచి చాహర్‌ను తప్పించడం ఖాయం.
ఈసారి జరిగిన మెగా వేలంలో దీపక్ చాహర్ రూ.14 కోట్లు పలికాడు. చాహెర్ ఈసారి రెండో అత్యంత ఖరీదైన ఆటగాడు. ఆల్ రౌండర్ ప్రదర్శన ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.