- Telugu News Photo Gallery Cricket photos Women's World Cup 2022: Team India Fast Bowler Jhulan Goswami eyes on Special Record, Most Wickets in Women's ODI World Cup
Women’s World Cup 2022: పాకిస్తాన్ మ్యాచ్‌లో ఝులన్ గోస్వామి ముందు భారీ రికార్డు.. వికెట్ల క్వీన్‌గా మారేందుకు రెడీ..
INDW vs PAKW: భారత్ నుంచి ప్రస్తుత మహిళా క్రికెట్‌లో అత్యంత అనుభవజ్ఞురాలైన ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి.. ఈసారి ప్రపంచ కప్‌లో వికెట్ల క్వీన్‌గా మారనుంది.
Updated on: Mar 08, 2022 | 3:03 PM

భారత్ నుంచి ప్రస్తుత మహిళా క్రికెట్‌లో అత్యంత అనుభవజ్ఞురాలైన ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి.. ఈసారి ప్రపంచ కప్‌లో వికెట్ల క్వీన్‌గా మారనుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించనుంది. ఆ రికార్డును తన పేరుగా మార్చుకోవడానికి, ఝులన్ కేవలం 4 బ్యాటర్లను అవుట్ చేయాల్సి ఉంది.

ఝులన్ గోస్వామి ప్రస్తుతం 28 మ్యాచుల్లో 36 వికెట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అంటే వారికంటే ముగ్గురు బౌలర్లు ముందున్నారు. కానీ, ఆ ముగ్గురిలో ఎవరూ ఇప్పుడు మహిళా క్రికెట్‌లో యాక్టివ్‌గా లేరు. అంటే ఝులన్‌కు ఇది మంచి అవకాశంగా నిలవనుంది.

మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన లిన్ ఫుల్స్టన్ రికార్డు సృష్టించింది. 1982-1988 మధ్య ప్రపంచకప్‌లో ఆడిన 20 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు తీసింది.

అత్యధిక వికెట్లు తీయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 24 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీసిన కరోల్ హాడ్జ్ రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో మూడో స్థానంలో ఉన్న క్లైర్ టేలర్ 26 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు పడగొట్టింది.




