AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI: ఈ ఇద్దరు ఆటగాళ్లని అదృష్టం వరించింది.. కొత్త కాంట్రాక్ట్‌లో ప్రమోషన్ దక్కింది..

BCCI: బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌లో ఆటగాళ్ల సంఖ్య 28 నుంచి 27కి తగ్గించింది. చాలా మంది ఆటగాళ్ల గ్రేడ్‌ని మార్చింది. కొంతమంది నష్టపోయారు.. మరికొంతమది లాభపడ్డారు.

BCCI: ఈ ఇద్దరు ఆటగాళ్లని అదృష్టం వరించింది.. కొత్త కాంట్రాక్ట్‌లో ప్రమోషన్ దక్కింది..
Mohammed Siraj
uppula Raju
|

Updated on: Mar 03, 2022 | 5:09 PM

Share

BCCI: బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌లో ఆటగాళ్ల సంఖ్య 28 నుంచి 27కి తగ్గించింది. చాలా మంది ఆటగాళ్ల గ్రేడ్‌ని మార్చింది. కొంతమంది నష్టపోయారు.. మరికొంతమది లాభపడ్డారు. కానీ భారత ఆటగాళ్ల నిరాశ ముఖాల్లో రెండు సంతోషకరమైన ముఖాలు వికసించాయి. వారిద్దరిని అదృష్టం వరించింది. నిరంతర ఆటతీరుకు రివార్డు లభించింది. కొత్త కాంట్రాక్ట్‌లో చోటు లభించింది. చాలా మంది ఆటగాళ్ల గ్రేడ్‌లు డిమోషన్‌ను చూపించగా మహ్మద్ సిరాజ్ ప్రమోషన్ పొందాడు. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ మొదటిసారిగా BCCI కాంట్రాక్ట్ జాబితాలోకి ప్రవేశించాడు. బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌లో 27 మంది ఆటగాళ్లను 4 వేర్వేరు గ్రేడ్‌లుగా విభజించింది. ఈ ఆటగాళ్లకు వారి గ్రేడ్ ప్రకారం ప్రతి సంవత్సరం వార్షిక మొత్తం చెల్లిస్తారు. గ్రేడ్ ఏ-ప్లస్ ఉన్న ఆటగాళ్లకు రూ.7 కోట్లు, గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు, గ్రేడ్ సిలో భాగమైన ఆటగాళ్లకు ఏటా కోటి రూపాయలు చెల్లిస్తారు.

సిరాజ్‌కి ప్రమోషన్

గత బీసీసీఐ ఒప్పందం ప్రకారం భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గ్రేడ్ సి విభాగంలో ఉన్నాడు. కానీ కొత్త ఒప్పందంలో బోర్డు ఆయనకు పదోన్నతి కల్పించి గ్రేడ్‌ సీ నుంచి బీ గ్రేడ్‌కు చోటు కల్పించింది. దీంతో బోర్డు నుంచి సిరాజ్ కు వచ్చే వార్షిక మొత్తం పెరిగింది. ఇప్పుడు రూ.కోటికి బదులు రూ.3కోట్లు అందుతాయి.

సూర్యకుమార్‌కు తొలిసారిగా స్థానం

భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కొత్త కాంట్రాక్ట్‌లో బోర్డు అతనికి సి గ్రేడ్‌లో స్థానం కల్పించింది. అంటే ఇప్పుడు అతనికి బోర్డు నుంచి సంవత్సరానికి కోటి రూపాయలు వస్తాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త ఒప్పందం ప్రకారం గ్రేడ్ A ప్లస్‌లో 3 మంది ఆటగాళ్లకు, గ్రేడ్ Aలో 5 మంది ఆటగాళ్లకు, గ్రేడ్ Bలో 7 మంది ఆటగాళ్లకు, గ్రేడ్ Cలో 12 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది.

BCCI కొత్త కాంట్రాక్టుల జాబితా..

గ్రేడ్ A+: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.

గ్రేడ్ A: రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, KL రాహుల్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్.

గ్రేడ్ B: అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.

గ్రేడ్ C: శిఖర్ ధావన్, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, శుభమాన్ గిల్, హనుమ విహారి, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మయాంక్ అగర్వాల్, సూర్య కుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా.

Viral Photos: బాయ్‌ఫ్రెండ్‌ కోసం వెతుకుతున్న 3 అడుగుల మోడల్.. పెళ్లి చేసుకొని సెటిల్‌ అవుతుందట..!

IND vs SL: భారత్, శ్రీలంక తొలి టెస్టు చాలా స్పెషల్.. 3 కారణాల వల్ల చరిత్రలో నిలుస్తుంది..

Snake Bite: పాము కాటేస్తే ఏం చేయాలి.. ఆపద సమయంలో ఇలా చేయండి..