Health Tips: ఏ సమస్య వచ్చినా అన్నం మానేయడమేనా? అసలు రైస్‌తో ప్రయోజనాలు తెలుసా..?
నడుము పట్టి చూసుకుని.. లేదా పొట్ట చూసుకుని.. అమ్మో వెయిట్ పెరిగిపోతున్నాం.. అన్నం తినడం మానెయ్యాలి లేదా తగ్గించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు.
White Rice: నడుము పట్టి చూసుకుని.. లేదా పొట్ట చూసుకుని.. అమ్మో వెయిట్ పెరిగిపోతున్నాం.. అన్నం తినడం మానెయ్యాలి లేదా తగ్గించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అదేంటో అన్నం మానేద్దాం అనుకుంటారు కానీ, వ్యాయామం చెయ్యాలని చాలామంది అనుకోరు. కాగా అన్నం పూర్తిగా మానడం కూడా కరెక్ట్ కాదని చాలామంది నిపుణుల అభిప్రాయం. అవును.. బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆల్కాహాల్ సేవించడం.. స్వీట్స్, జంక్ ఫుడ్ లాగించడం.. క్రమ పద్దతి లేని ఆహారపు అలవాట్లు వంటి కారణాలు కూడా ఉంటాయి. ఇక అన్నాన్ని పూర్తిగా మానేయడం కలిగే నష్టాల గురించి గతంలో దసరా పండుగ సందర్భంగా ప్రముఖ న్యూట్రిషనిస్టు రుజుతా దివేకర్ వివరణ ఇచ్చారు. అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఎక్కువ పాలిష్ చేసిన రైస్ వండటం వల్ల ఈ ప్రయోజనాలు అందవన్న సంగతి గుర్తుంచుకోవాలి.
1. అన్నం ప్రీ బయోటిక్. దీన్ని తినడం వల్ల శరీరంలోని మంచి సూక్ష్మజీవులకు ఆహారం అందుతుంది.
2. హ్యాండ్ మిల్లింగ్, సింగిల్ పాలిష్ చేసిన బియ్యం ద్వారా ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీటిని ఎలా తిన్నా ప్రొటీన్లు లభిస్తాయి. ఈ రైస్ వండినప్పుడు వచ్చే గంజి తాగినా ఎంతో బలం లభిస్తుంది. రైస్‌తో పాటు పల్సస్, మొలకలు, పెరుగు ఇలా ఏమైనా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు
3. శరీరంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండాలంటే.. అన్నం తక్కువ పెట్టుకుని అందులో పప్పు, కూరలు, మాంసం, నెయ్యి వంటి వాటిని ఎక్కువ పరిణామంలో తీసుకోవాలి
4. అన్నం తేలిగ్గా జీర్ణం అవుతుంది. మంచిగా నిద్ర పడుతుంది. హార్మోన్ల సమతుల్యత లభిస్తుంది. యంగ్ ఏజ్‌తో పాటు వయసు పైబడి షుగర్ వ్యాధులు లేనివారికి రైస్ ఎంతో కొంత అవసరం
5. చర్మానికి రైస్ చాలా ఉపయోగపడుతుంది. అధిక ప్రోలాక్టిన్ స్థాయిల వల్ల చర్మంపై ఏర్పడిన రంధ్రాలను నిరోధిస్తుంది
6. థైరాయిడ్ కారణంగా దెబ్బతిన్న జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
View this post on Instagram
అన్నంలో పీచు అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, నీరసం తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరాన్ని త్వరగా అలసిపోనివ్వదు. అధిక వేడితో కడుపులో కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధకశక్తిని అన్నం పెంచుతుంది. పేగుల్లో పెరుగుతున్న అల్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
(Note:ఈ సమాచారం పాఠకుల ఆసక్తిని అనుసరించి ఇచ్చింది. ఎవరైనా ఆరోగ్య నిపుణులు, లేదా వైద్యుల సలహాలను అనుసరించి ఫాలో అవ్వాల్సి ఉంటుంది.)
Also Read: AP: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..