Avoid Dinner: రాత్రిళ్లు భోజనం తినడం మానేసినవారికి షాకింగ్ న్యూస్..
ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. వెయిట్ లాస్ డైట్ ఫాలో కావడం.
ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. వెయిట్ లాస్ డైట్ ఫాలో కావడం.. అన్నం తినడం తక్కువ చేయడం.. కేవలం లిక్విడ్ ఫుడ్ మాత్రమే తినడం చేస్తుంటారు. అంతేకాకుండా.. వర్కవుట్స్.. జాగింగ్.. యోగా వంటి వ్యాయమాలు చేస్తూ బరువు తగ్గించుకునేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువ మంది ఫాలో అవుతున్న వెయిట్ లాస్ డైట్ .. ఒక్క పూట మాత్రమే భోజనం చేయడం.. రోజులో అల్పహారం.. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిళ్లు భోజనం చేయడం మానేస్తున్నారు. దీంతో బరువు తగ్గిపోతారు అనే అపోహా చాలా మందిలో ఉంది. అయితే రాత్రిళ్లు భోజనం మానేయడం వలన ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అనారోగ్య సమస్యలతోపాటు.. బలహీనంగా మారిపోతుంటారు. అలా కొన్ని రోజులపాటు రాత్రిళ్లు భోజనం చేయడం మానేయడం వలన అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అవెంటో తెలుసుకుందామా.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం అల్పాహరం చేయడం.. మధ్యాహ్నం భోజనం చేయడం.. రాత్రిళ్లు భోజనానికి చాలా గ్యాప్ ఉంటుంది. దీంతో ఒక్కపూట భోజనం మానివేసినా.. బలహీనంగా మారిపోతుంటారు. దీంతో మీరు ప్రతి సారి అలసటకు గురవుతుంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు భోజనం మానివేస్తే.. శరీరానికి తగినంత పోషకాలు అందవు.. దీంతో బలహీనంగా ఉంటారు. బరువు తగ్గడం కోసం డైట్ ఫాలో అవుతున్నవారు.. రాత్రిళ్లు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. రాత్రి భోజనం చేయకపోవడం వలన ఆకలి తీరదు.. అలాగే.. నిద్రపోతున్న సమయంలో కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీంతో నిద్ర పూర్తిగా ఉండదు. ఆరోగ్యం దెబ్బతింటుంది.
బరువు తగ్గించుకోవడం ఎంత ముఖ్యమో.. అదే సమయంలో శరీరానికి పోషకాలను అందివ్వడం కూడా అంతే ముఖ్యం. రాత్రిళ్ళు భోజనం చేయకపోవడం వలన శరీరానికి తగినంత పోషకాహారం అందదు. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇది ఆరోగ్యంపై ప్రభావితం చేయడమే కాకుండా.. రక్తహీనత, బలహీనత, తలతిరగడం.. తర్వగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రిళ్లు భోజనం మానివేయకుండా.. తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
గమనిక :- ఈ కథనం కేవలం వెబ్ సైట్స్ ఆధారంగా, నిపుణుల సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. వీటిని అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.