AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: తెలుసా! వాతావరణ మార్పులు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయట.. షాకింగ్ ఫ్యాక్ట్స్!

జీవనయానంలో సుఖదుఃఖాలు సర్వసాధారణమనే విషయం అందరికీ తెలిసిందే! భావోధ్వేగాలకు అతీతంగా బతకడమనేది ఈ జిందగీలో దాదాపు ఎవ్వరికీ సాధ్యం కాదు..

Knowledge: తెలుసా! వాతావరణ మార్పులు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయట.. షాకింగ్ ఫ్యాక్ట్స్!
Mental Health
Srilakshmi C
|

Updated on: Mar 03, 2022 | 6:59 PM

Share

Impact of Climate Change on Mental Health: జీవనయానంలో సుఖదుఃఖాలు సర్వసాధారణమనే విషయం అందరికీ తెలిసిందే! భావోధ్వేగాలకు అతీతంగా బతకడమనేది ఈ జిందగీలో దాదాపు ఎవ్వరికీ సాధ్యం కాదు. చదువుల వల్లనో, ఉద్యోగ రిత్యనో, రక్త సంబంధికులతో గొడవల వల్లనో.. పదేపదే ఆలోచించడం కారణంగా టెన్షన్‌ పడటం సాధారణంగా జరుగుతుంది. టెన్షన్ తీవ్రతరం ఐతే హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తుంది. ఇంకా హద్దులు మీరితే డిప్రెషన్‌ (depression)లోకి వెళ్లడం ఖాయం. డిప్రెషన్‌కు ఈ విధమైన కారణాలు ఉంటాయని ఇప్పటివరకు మనందరం అనుకుంటున్నాం. ఐతే మీకు తెలుసా.! రోజు వారి కార్యకలాపాలు, రిలేషన్ల ద్వారానే కాకుండా ఒక్కోసారి వాతావరణ మార్పులు (climatic conditions) కూడా ఒత్తిడి, రక్తపోటు, నిద్రలేమి, నిరాశకు కారణమవుతాయట. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తీవ్రమైన మానసిక సమస్యలు ( mental health problems) తలెత్తుతాయని తాజాగా IPCC నివేదిక పేర్కొంది.

మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఐపీసీసీ విడుదల చేసిన ‘Climate Change 2022: Impacts, Acceptances and Risks’ అనే నివేదికలో వాతావరణానికి సంబంధించిన అనేక ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. వాతావరణం వల్ల తలెత్తే మానసిక ఆరోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్యంపై వాతావరణం చూపే ప్రతికూల ప్రభావాలను వివరించింది.

ఐపీసీసీ నివేదిక హెచ్చరికలు నివేదిక ప్రకారం.. క్లైమాట్‌ రిస్క్‌ ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణ సంఘటనలు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశంలో ఎక్కువ కాలం నివసించడం అనేవి మానసిక అనారోగ్యానికి దారితీస్తాయి. పోషకాహార లోపం వంటి ఇతర కారణాలు కూడా మానసిక ఆరోగ్యంపై పరోక్ష ప్రభావం చూపుతాయని పేర్కొంది. ఈ కారణాల వల్ల ప్రపంచంలో.. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఆయా ప్రదేశాల్లోని వేడిగాలులు, ఆహారం – తాగునీటి కొరత, సముద్ర మట్టం పెరగడం వంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది.

200 దేశాలలో ఆ సమస్యలు..

ఈ విధమైన నేపథ్యమున్న దేశాల్లో ఆందోళన, నిరాశ, ఒత్తిడి, నిరాశ, నిద్రలేమితో సహా మోస్తరు నుంచి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యల బారీన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ఇది వాస్తవమని దాదాపు 200 దేశాలు పేర్కొన్నట్లు నివేదిక తెల్పింది. ఆయా మానసిక ఆనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులు వెంటనే ఆసుపత్రుల్లో చేరి తగు వైద్యం చేయించుకోవాలని సూచించింది.

Also Read:

HBCSE-TIFR Jobs 2022: రాత పరీక్ష లేకుండానే.. హోమీ భాభా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు