Telangana: కానిస్టేబుల్ గారూ..! మీరే ఇలా చేస్తే ఎలా..? ఇప్పుడు తలదించుకుంటే సరిపోద్దా..?
అతడో పోలీస్. నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ప్రజలకు అన్యాయాలు జరగకుండా చూడాలి. తప్పు చేసేవాళ్ల తాట తీయాలి. కానీ అతడే తప్పడు మార్గంలో నడిచాడు.
Crime News: అతడో పోలీస్. నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ప్రజలకు అన్యాయాలు జరగకుండా చూడాలి. తప్పు చేసేవాళ్ల తాట తీయాలి. కానీ అతడే తప్పడు మార్గంలో నడిచాడు. రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తూ భార్యాపిల్లలను వదిలేశారు. దారితప్పిన వారికి బేడీలు వేయాల్సిన వ్యక్తి.. ఇప్పుడు నలుగురి ముందు తల దించుకుని నిలబడ్డాడు. ఇంతకూ అతని చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసుకుందాం పదండి. నల్గొండ జిల్లా(nalgonda district) నాగార్జున సాగర్(Nagarjuna Sagar)కు చెందిన ప్రసాద్, శాంతిలకు 2001లో పెళ్లైంది. వీరికి ఇద్దరు సంతానం. 2015లో హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే సమయంలో అక్కడ ఓ మహిళతో సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంపై భార్య పలుసార్లు ప్రశ్నించగా.. అతడు లైట్ తీసుకున్నాడు. కొన్నాళ్లకు భార్యను, పిల్లలను పట్టించుకోవడమే మానేశాడు. పరాయి మహిళ మోజులో పడి పచ్చని కాపురంలో నిప్పులు పోసుకున్నాడు. కాగా విధుల్లో భాగంగా నల్గొండ జిల్లాకు ట్రాన్స్‌ఫర్ కావడంతో అక్కడకు వెళ్లిపోయాడు. అయితే అది భార్యాపిల్లలతో కాదు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో. దీంతో అతడి ఆళి.. కాళిగా మారింది. గురువారం ఉదయం పరాయి మహిళతో ఉండగా భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నావంటూ భర్తను కొట్టి పోలీసులకు అప్పగించింది. తనకు, తన బిడ్డలకు న్యాయం చేయాలని ఆమె పోలీసు పెద్దలను కోరుతుంది.
Also Read: AP: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..