BJP vs YCP: అనంతపురం ప్రోటోకాల్ రగడ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎదుటే ఎంపీ గోరంట్ల లడాయి!
కాబోయే ఐఆర్ఎస్ అధికారుల శిక్షణా కేంద్రం నాసిన్ శంఖుస్థాపన కార్యక్రమం- ఆదిలోనే హంస పాదు. ఈ జాతీయ స్థాయి నైపుణ్య సంస్థ ఇక్కడ మొదలు పెట్టీపెట్టక ముందే.. వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య లుకలుకలు.
Hindupur Protocol Dispute: కాబోయే ఐఆర్ఎస్ అధికారుల శిక్షణా కేంద్రం నాసిన్ శంఖుస్థాపన కార్యక్రమం- ఆదిలోనే హంస పాదు. ఈ జాతీయ స్థాయి నైపుణ్య సంస్థ ఇక్కడ మొదలు పెట్టీపెట్టక ముందే.. వైసీపీ(YCP), బీజేపీ(BJP) నాయకుల మధ్య లుకలుకలు. ప్రొటోకాల్ పోరాటాలు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఈ రోజు అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీ పనుల శంకుస్థాపనకు విచ్చేసిన సందర్భంగా ప్రొటోకాల్ వివాదం రాజుకుంది. కేంద్ర అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఎంపీ గోరంట్ల మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆహ్వాన పత్రికలో తన పేరు లేదని వాపోయారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు.
నాసిన్ అంటే నేషనల్ అకాడెమీ ఫర్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. దీన్నే షార్ట్ గా పిలిస్తే నాసిన్ అంటారు. ఈ జాతీయ సంస్థను ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపూర్ నియోజకవర్గంలోని పాలసముద్రంలో స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీ పనుల శంకుస్థాపనకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విచ్చేశారు. అయితే, ఆహ్వాన పత్రికలో స్థానిక పార్లమెంటు సభ్యులు గోరంట్ మాధవ్ తన పేరు లేదంటూ రచ్చకు దిగారు. కేంద్ర అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపూర్ లో స్థాపించనున్న ఈ నేషనల్ లెవల్ ఇన్ స్టిట్యూషన్ కి ఈ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించక పోవడంతో మాకు తీరని అన్యాయం జరిగిందని. తీవ్ర నిరసన గళం వినిపించారు.ప్రజాస్వామ్యంలో పాలకులు నియంతృత్వంతో పోవద్దని సూచించారు.
కాబోయే ఐఏఎస్ అధికారులకు ఉత్తరాకండ్ మసూరీలో ఎలాగైతే ట్రైనింగ్ ఇస్తారో. ఫ్యూచర్ ఐపీఎస్ ఆఫీసర్లకు హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడెమీలో ఎలా శిక్షణ ఇస్తారో. హిందూపూర్- నియోజకవర్గంలోని పాలసముద్రంలో స్థాపించ బోతున్న నాసిన్ లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులను అలాగే ట్రైనప్ చేస్తారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీలో తాము స్థాపించబోతున్న ఈ జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణా సంస్థ నిర్మానానికి తొలి విడతగా రూ. 729 కోట్ల రూపాయలను ఇస్తున్నామనీ. ఇప్పటికే ఏపీ మంత్రి బుగ్గన గజేంద్ర మోక్షం కామెంట్లకు తానెంతగానో చలించిపోయాననీ.. అన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఏపీ మొత్తానికి తాము ఇప్పటికిప్పుడు మేలు చేయక పోయినా. హిందూపూర్ లోని ఈ పాలసముద్రానికి మాత్రం ఎంతో కొంత సాయం చేస్తున్నందుకు సంతృప్తిగా ఉందన్నారు.
Union Finance Minister Smt. @nsitharaman today laid foundation stone for the new National Academy of Customs, Indirect Taxes & Narcotics (NACIN) at Palasamudram Village, near Hindupur, Ananthapur District in Andhra Pradesh. (1/2) pic.twitter.com/cQcMYtjRvm
— Ministry of Finance (@FinMinIndia) March 5, 2022
నిర్మలమ్మ ప్రసంగం కొనసాగుతుండగానే.. మరొక పక్క స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్ అనుకున్నట్టుగానే తన అసంతృప్తి మొత్తం వెళ్లగక్కారు. కేంద్ర మంత్రి దృష్టికి విషయం తీసుకెళ్లారు. ఎంపీ గోరంట్ల స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు జరిగిన అన్యాయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సరే. బుగ్గన గజేంద్ర మోక్షం కామెంట్లకు వచ్చిన రియాక్షన్ ఎంపీ గోరంట్ల ప్రొటోకాల్ అసంతృప్త వ్యాఖ్యలకు వచ్చినట్టు కనిపించలేదు. ఆ తర్వాతైనా దీనికి కేంద్ర మంత్రి నుంచి స్పందన వస్తుందా? తెలియాల్సి ఉంది.
Read Also…