అసెంబ్లీ సమావేశాల్లో ఆ మూడు అంశాలను లేవనెత్తుతాం.. వైసీపీకి టీడీపీ వార్నింగ్

అసెంబ్లీ సమావేశాల్లో ఆ మూడు అంశాలను లేవనెత్తుతాం.. వైసీపీకి టీడీపీ వార్నింగ్
Achenna

రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలను చట్ట సభల్లో ప్రస్తావనకు తీసుకొస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Acchennaidu) అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు  హాజరుకావాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకుందని...

Ganesh Mudavath

|

Mar 05, 2022 | 7:27 PM

రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలను చట్ట సభల్లో ప్రస్తావనకు తీసుకొస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Acchennaidu) అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు. వైకాపా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తోందని అచ్చెన్న వెల్లడించారు. వైసీపీ(YCP) తప్పుడు విధానాలను ఎండగట్టాలనే లక్ష్యంతో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతి, పోలవరం, వివేకా హత్య వంటి ప్రధాన అంశాలను అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు. కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా వైసీపీ కి బుద్ధి రావడం లేదన్నారు. టీడీపీ(TDP) తీసుకున్న నిర్ణయం సరైనదని కోర్టులో తేలిందన్న అచ్చెన్న.. మళ్లీ మూడు రాజధానులు తీసుకొస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మూడు సంవత్సరాల్లో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. ఈసారీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదని, జాబ్‌ క్యాలెండర్‌ అని చెప్పి ఇంత వరకు అమలు చేయలేదని మండిపడ్డారు.

ఎన్నో సమస్యలపై తమకు ప్రజల నుంచి విజ్ఞప్తులు, దరఖాస్తులు వచ్చాయని, ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను సభల్లో ప్రస్తావిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయంఅసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా ? వద్దా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా తెదేపాలో చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్‌గా సమావేశమైన తెదేపా శాసనసభాపక్షం దీనిపై స్పష్టత ఇచ్చింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాలకు చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలకు దూరంగా ఉండాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. గత సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

వ్యక్తిగత దూషణలతో చంద్రబాబును అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ.. గత అసెంబ్లీ సమావేశాలను టీడీపీ మధ్యలోనే బహిష్కరించింది. ఈ నేపథ్యంలో మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని చంద్రబాబు శపథం చేశారు. అయితే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికార వైసీపీ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా అసెంబ్లీకి వెళ్లాలని కొందరు టీడీపీ నేతలు ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా అన్న అంశంపై టీడీపీ హైకమాండ్ విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న టీడీపీ.. రాబోయే రెండేళ్లు ప్రజల మద్దతు పొందేందుకు ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచన చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.

తెలుగుదేశం మొదటి నుంచి చట్టసభల్ని దేవాలయంగా భావిస్తోంది. చట్టసభలకు రాకుండా వైసీపీ రెండేళ్లు పారిపోయింది. ప్రజా సమస్యలను చర్చించి, తప్పులు ఎండగట్టేందుకే సభకు వస్తున్నాం. మా ప్రశ్నలు లేవనెత్తేందుకు సరైన సమయం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకనుగుణంగా వ్యవహరించకుంటే ప్రభుత్వం పారిపోయినట్లే భావిస్తాం.

– యనమల రామకృష్ణుడు, మాజీమంత్రి

గత సమావేశాల్లో ప్రతిపక్షనేతకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెజారిటీ ఉందని హక్కులు కాలరాసే విధంగా అధికారపక్షం వ్యవహరించటం తగదు. న్యాయ వ్యవస్థ కూడా తాము చెప్పినట్లు నడవాలనే ధోరణిలో వైసీపీ ఉంది.

– గోరంట్ల బుచ్చయ్య చౌదరి,టీడీపీ ఎమ్మెల్యే

Also Read

BJP vs YCP: అనంతపురం ప్రోటోకాల్ రగడ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎదుటే ఎంపీ గోరంట్ల లడాయి!

ఆ విషయంలో దేశానికే తెలంగాణ ఆదర్శం.. అలా చేయడమే ప్రభుత్వం లక్ష్యం.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్య

Telangana: కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu