AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మారిన టీడీపీ వ్యూహం..ఈసారి అసెంబ్లీ సెషన్‌కు హాజరు.. కానీ

టీడీపీ వ్యూహం మార్చింది. అధికార పక్షంతో ఎదురుదాడికి రెడీ అయ్యింది. మరింత స్పీడ్ పెంచి కార్యకర్తల్లో జోష్ నింపాలని డిసైడ్ అయ్యింది.

Andhra Pradesh: మారిన టీడీపీ వ్యూహం..ఈసారి అసెంబ్లీ సెషన్‌కు హాజరు.. కానీ
Chandrababu
Ram Naramaneni
|

Updated on: Mar 05, 2022 | 7:16 PM

Share

TDP: టీడీపీ వ్యూహం మార్చింది. అధికార పక్షంతో ఎదురుదాడికి రెడీ అయ్యింది. మరింత స్పీడ్ పెంచి కార్యకర్తల్లో జోష్ నింపాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు వర్చువల్‌గా జరిగిన టీడీఎల్పీ సమావేశంలో అధినేత చంద్రబాబు(Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. తన కుటుంబంపై వ్యక్తిగత దూషణ చేశారని ఆరోపిస్తూ.. మళ్లీ అధికారం చేపట్టేవరకు అసెంబ్లీకి రానని చంద్రబాబు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈనెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన ఈ నెల11న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలను చట్టసభల్లో లేవనెత్తుతామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీఎల్పీ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. చట్టసభలకు హాజరుకావాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు.

మరోవైపు  అమరావతి, పోలవరం విషయంలో TDP-YCP మధ్య డైలాగ్‌ వార్ కంటిన్యూ అవుతోంది. కోర్టు తీర్పు తర్వాతైన ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలన్నారు చంద్రబాబు. దీనికి కౌంటర్లు ఇచ్చారు YCP నేతలు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మరో 2 ఏళ్లయితే చంద్రబాబు అండ్ కో ఈ రాష్ట్రం వదిలి పారిపోతుందని విమర్శించారు.

Also Read: Telangana: కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే