రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.. ఇంతకీ వారేం చేశారంటే

ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌(Meerut)లో ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం(Fire accident in Train) జరిగింది. సహరాన్ పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ట్రైన్ దౌరాలా స్టేషన్‌ కు వచ్చిన సమయంలో మంటలు చెలరేగాయి. రైలు బ్రేక్‌ జామ్‌..

రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.. ఇంతకీ వారేం చేశారంటే
Fire Accident In Train
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 05, 2022 | 6:47 PM

ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌(Meerut)లో ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం(Fire accident in Train) జరిగింది. సహరాన్ పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ట్రైన్ దౌరాలా స్టేషన్‌ కు వచ్చిన సమయంలో మంటలు చెలరేగాయి. రైలు బ్రేక్‌ జామ్‌ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రైలు ఇంజిన్ సహా రెండు బోగీలు దగ్ధమయ్యాయి. రైలు దౌరాలా(Dowrala) స్టేషన్‌కు చేరుకోగానే ఇంజిన్‌ కింది నుంచి మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. దీంతో ప్రయాణీకులు అప్రమత్తమై ప్లాట్‌ ఫాం పైకి పరుగులు తీశారని వెల్లడించారు. రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే వెనుక కోచ్‌లలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు రైలు ఇంజిన్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. వెనుక కోచ్‌లకూ అగ్ని కీలలు వ్యాపించాయి. రైల్వే యంత్రాంగం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకోగానే రెండు బోగీలు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పారు. అప్రమత్తమైన ప్రయాణికులు రైలులోని ఇతర కోచ్‌లకు ఇంజిన్ తో అనుసంధానమైన పరికరాన్ని తొలగించి, రైలు నుంచి ఇంజిన్ ను వేరు చేశారు.

రైలు వేగంగా వెళ్తున్న సమయంలో శబ్ధంతో పాటు దుర్వాసన వచ్చిందని, దీనికి కారణం ఏమిటో అర్థం కాలేదని ఘటన నుంచి బయటపడ్డ ప్రయాణికులు తెలిపారు. తర్వాత ఒక్కసారిగా సీటు కింద నుంచి పొగలు రావడం మొదలైందన్నారు. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్‌కు చెప్పేందుకు ప్రయత్నించామని, మాటౌర్ గ్రామం చేరుకునే సరికి పొగ బాగా పెరిగిపోయిందని వివరించారు. దీంతో భయాందోళనకు గురయ్యామని వెల్లడించారు. రైలింజన్లో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని.. ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

Also Read

Sadha: వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారిన సదా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

BECIL Jobs: డిగ్రీ అర్హతతో..బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. వారం రోజుల్లో..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!