AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింత! 7 తరాల తర్వాత ఆడపిల్ల పుట్టిందని.. ఏకంగా చందమామపై ఎకరం భూమిని కొని గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రలు!

కోరితే కొండ మీద కోతినైనా తెచ్చి ఇస్తారనే సామెత ఉంది. కానీ ఏకంగా కూతురిపై ప్రేమతో చంద్రమండలంలో స్థలాన్ని కొన్నారంటే వీళ్లది మామూలు ప్రేమ కాదుకదా! ఆడపిల్లలను ఛీత్కారంగా భావించే ఈ సమాజానికి ఈ దంపతుల ప్రేమ ఓ చెంపపెట్టులాంటిది..

వింత! 7 తరాల తర్వాత ఆడపిల్ల పుట్టిందని.. ఏకంగా చందమామపై ఎకరం భూమిని కొని గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రలు!
Girl Child
Srilakshmi C
|

Updated on: Mar 05, 2022 | 8:08 PM

Share

Daughter born after ‘7 generations’ in these Bihar family: ఆడపిల్ల కడుపులో ఉండగానే ఎలా వదిలించుకోవాలా? అని ఆలోచించే ఈ లోకంలో ఇటువంటి వాళ్లు కూడా ఉంటారా? అనే సందేహం కలిగేలా ఉందీ సంఘటన. బీహార్‌ (Bihar)లోని మధుబని జిల్లాలో అటువంటి వింత ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఈ దంపతులు తమ కుమార్తె జన్మదినాన్ని చిరస్మరణీయంగా నిలపాలని, కూతుళ్లపట్ల సమాజానికి పాజిటివ్‌ మెసేజ్‌ అందించడానికి వినూత్నంగా తమ కుమార్తె  (Girl Child )పదో పుట్టిన రోజుకు ప్రత్యేక బహుమతి ఇచ్చారు. కనీసం ఊహకైనా అందని, అరుదైన గిఫ్ట్‌ను తమ గారాలపట్టికి మురిపెంగా ఇచ్చారీ దంపతులు..

నిజానికి బీహార్‌లోని ఝంఝార్‌పూర్‌లో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నడుపుతున్న డాక్టర్ సుర్విందర్ ఝా, డాక్టర్‌ సుధా ఝా తమ కుమార్తె ఆస్తా భరద్వాజ్‌ పేరుమీద ఏకంగా చంద్రమండలంలో ఒక ఎకరం భూమిని కొని, రిజిస్టర్‌ చేసేశారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. దీనిపై మీడియాతో మాట్లాడుతూ..’ఆస్తా భరద్వాజ్ తమ కుటుంబంలో మొదటి కుమార్తె. దాదాపు ఏడు తరాల తర్వాత మా ఇంట ఆడపిల్ల పుట్టింది. ఇప్పటి వరకు ఆడపిల్లల గలగల నవ్వులు, ఆటలు మా ఇంట్లోనే లేవు. ఇన్నేళ్ల తర్వాత మొదటి ఆడపిల్లగా ఆస్తా పుట్టాక.. మా కుటుంబంలో చెప్పలేనంత సంతోషం పొంగుకొచ్చింది. ఈ ఆనందాన్ని గుర్తిండిపోయేలా చేయడానికే.. చంద్రునిపై భూమిని కొని నా కూతురు పదో పుట్టిన రోజుకు గిఫ్ట్‌గా ఇచ్చామని’ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఐతే చండ్రమండలంలో భూమిని కొనడం అంత సులువుగా జరగలేదు. అక్కడ ఎకరం భూమిని కొని, రిజిస్టర్‌ చెయ్యడానికి ఒకటిన్నర సంవత్సరం పట్టింది. కూతురికి ఇవ్వబోయే ప్రత్యేక గిఫ్ట్‌ను కొనడానికి ముందుగా..సురవీందర్‌ యూఎస్‌ఏలోని కాలిఫోర్నియా లూనా సొసైటీ వెబ్‌సైట్‌కి అన్ని రకాల పేపర్‌వర్క్‌లను సమర్పించి, అక్కడి ల్యాండ్‌ ధరలు తెలుసుకుని, PayPal యాప్ ద్వారా రిజిస్ట్రీ ఫీజు మొత్తాన్ని చెల్లించాక ఈ ఏడాది జనవరి 27న దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక చంద్రునిపై భూమిని కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు స్పీడ్ పోస్ట్ ద్వారా తమ ఇంటికి వచ్చినట్లు తెలిపారు.

ఏది ఏమైనా.. కోరితే కొండ మీద కోతినైనా తెచ్చి ఇస్తారనే సామెత ఉంది. కానీ ఏకంగా కూతురిపై ప్రేమతో చంద్రమండలంలో స్థలాన్ని కొన్నారంటే వీళ్లది మామూలు ప్రేమ కాదుకదా! ఆడపిల్లలను ఛీత్కారంగా భావించే ఈ సమాజానికి ఈ దంపతుల ప్రేమ ఓ చెంపపెట్టులాంటిది. నిజమే కదా!

Also Read:

Health risks of obesity: అధిక బరువును తక్కువగా అంచనా వేయకండి! జాగ్రత్త.. స్లీప్ అప్నియా, బ్రెయిన్‌ స్ట్రోక్ ఇంకా..