Telugu Students: తిండి లేదు.. చుట్టూ బాంబుల మోత.. బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీసిన పాలమూరు బిడ్డ

బాంబుల పేలుళ్లు, ఎటు చూసిన విధ్వంసం.. బయటకు వెళ్లలేరు.. తిండికి కష్టమే.. బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు దక్కించుకున్నారు.

Telugu Students: తిండి లేదు.. చుట్టూ బాంబుల మోత.. బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీసిన పాలమూరు బిడ్డ
Ukraine Student
Follow us

|

Updated on: Mar 05, 2022 | 7:35 PM

Telugu Students faced in War Zone: బాంబుల పేలుళ్లు, ఎటు చూసిన విధ్వంసం.. బయటకు వెళ్లలేరు.. తిండికి కష్టమే.. బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు దక్కించుకున్నారు. ఇదీ ఉక్రెయిన్(Ukraine)తో రష్యా(Russia) యుద్దం ప్రారంభం కాగానే మహబూబ్ నగర్(Mahabubnagar) వైద్య విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు. ఎలాగైనా స్వదేశానికి చేరాలని అనుకున్న వారు బస్సులు, రైళ్లు ఏ రవాణా వ్యవస్థ దొరికితే దాన్ని ఉపయోగించుకున్నారు. అవసరమైతే కాలి నడకను నమ్ముకున్నారు. ఎట్టకేలకు ఆ దేశం దాటారు. కానీ…చదువు మధ్యలోనే ఆగిపోవడంతో పాటు కాయాకష్టం చేసి పైసా పైసా కూడగట్టి ఎంబిబిఎస్ చదువుకోసం తమ పిల్లల్ని ఉక్రెయిన్కు పంపారు తల్లిదండ్రులు. అప్పులపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన యోజిత ఉక్రెయిన్ లోని ఒడెస్సాలో MBBS నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఫిబ్రవరి 15 నుంచి హాస్టల్లోనే తోటి విద్యార్ధులతో కలిసి బిక్కుబిక్కుమంటూ గడిపారు. బాంబుల పేలుళ్లతో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి 26న బస్సులో బయలుదేరి 36 గంటలు ప్రయాణించి రొమేనియా సరిహద్దుకు చేరుకున్నామని యోజిత చెబుతున్నారు. సరిహద్దు దాటేందుకు ఏడు గంటల పాటు నడిచారు. సరిహద్దు దాటాక భారత రాయబారి కార్యాలయం అధికారుల అన్ని విధాల సహయం చేశారని యోజిత చెప్పారు. అయితే యుద్ధం మొదలైందనే వార్త విన్న తర్వాత తనకు చాలా భయమేసిందని, తన కూతురు సురక్షితంగా ఇంటికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని యోజిత తల్లి చెబుతున్నారు.

కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు విద్యాపరంగా భారీగా నష్టపోయారు. ఇప్పుడు యుద్ధంతో ఉక్రెయిన్ విద్యార్ధుల చదువులకు ఆటంకం కలిగింది. ఉన్న దేశంలో మంచి చదువులకు ఉన్నత అభ్యసించలేక, తక్కువ ఖర్చులో మెడిసిన్ పూర్తి చేయోచ్చనే ఉద్దేశంతో వెళ్లిన విద్యార్ధులకు అడుగడుగున ఆటంకాలే ఎదురయ్యాయి. MBBS చదివించాలంటే ఇక్కడా చాలా ఖర్చవుతుంది. కాబట్టి పైసా పైసా కూడబెట్టి తన కూతురిని డాక్టర్ ను చేయాలనుకున్నానని, ఇప్పుడు చదువు అర్థంతరంగా ముగిసింది. మిగతా చదువు కొనసాగాలే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు. విద్యాపరంగా భారీగా నష్టపోయిన విద్యార్ధుల చదువులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవడంతో పాటు లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలైన తల్లిదండ్రులను కూడా ఆదోకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

సమీ, టీవీ 9 ప్రతినిధి, మహబూబ్‌నగర్.

Read Also…

Lady Barber: శ్రమిస్తూ.. విభిన్న రంగంలో రాణిస్తున్న మహిళ.. శభాష్ అనిపించుకుంటున్న సిద్ధిపేట వాసి