- Telugu News Photo Gallery Viral photos Know about man having huge hands like hulk people are shocked after seeing the size of his hands
Viral Photos: హాలీవుడ్ హల్క్ సినిమా చూశారా.. ఇప్పుడు నిజ జీవితంలో హల్క్‌ని చూడండి..!
Viral Photos: మీరు హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'హల్క్' చూసే ఉంటారు. ఇందులో సాధారణంగా కనిపించే ఓ వ్యక్తి హల్క్‌గా మారతాడు. అంటే అతని శరీరం భారీగా మారిపోతుంది. అతను చాలా శక్తివంతంగా మారతాడు.
Updated on: Mar 05, 2022 | 7:18 PM

మీరు హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'హల్క్' చూసే ఉంటారు. ఇందులో సాధారణంగా కనిపించే ఓ వ్యక్తి హల్క్‌గా మారతాడు. అంటే అతని శరీరం భారీగా మారిపోతుంది. అతను చాలా శక్తివంతంగా మారతాడు. బరువైన చేతులతో ఎవరినైనా క్షణాల్లో మట్టి కరిపిస్తాడు. నిజ జీవితంలో కూడా ఇలాగే జరిగితే ఎలా ఉంటుంది.. అవును అమెరికాలో నివసిస్తున్న ఒక వ్యక్తి చేతి హల్క్ అంత పెద్దదిగా ఉంటుంది. అతని శరీరం సామాన్య మానవుడిలా ఉన్నప్పటికీ చేతులు చాలా పెద్దవిగా ఉంటాయి.

ఈ వ్యక్తి పేరు జెఫ్ డాబే. అతను అమెరికాలోని మిన్నెసోటా నివాసి. ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అతని చేయి ఇతర వ్యక్తుల కంటే చాలా పెద్దదిగా ఉంటుంది.

డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. 48 ఏళ్ల జెఫ్ చేతి చుట్టుకొలత 19.30 అంగుళాలు. అతను ధరించిన ఉంగరం పరిమాణం 5 అంగుళాలు. అతను ఒకేసారి రెండు బాస్కెట్‌బాల్‌లను పట్టుకోగలడు. అంటే అతని చేతి ఎంత పెద్దగా ఉంటుందో ఊహించవచ్చు.

నివేదికల ప్రకారం ఫ్లోరిడాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్మ్ రెజ్లింగ్ గ్రాండ్‌మాస్టర్ టోర్నమెంట్‌లో కూడా జెఫ్ పాల్గొని విజేతగా నిలిచాడు.

జెఫ్ చేతులు ఎందుకు పెద్దవిగా ఉన్నాయి. అది ఎలా జరిగిందో తెలియదు. వైద్యులు ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు. అనేక పరీక్షలు చేసినా ఏమీ దొరకలేదు. పెద్ద చేతులు కలిగి ఉండటం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని జెఫ్ చెప్పడం విశేషం.





























