- Telugu News Photo Gallery Viral photos Weird disease named crocodile tear syndrome makes man cry every time he eats
Viral Photos: వింత వ్యాధితో ఇబ్బందిపడుతున్న వ్యక్తి.. ఎప్పుడు భోజనం చేసినా ఏడవాల్సిందే..!
Viral Photos: సాధారణంగా వ్యక్తులు నొప్పి ఉంటే ఏడుస్తారు. లేదంటే భావోద్వేగానికి గురైనప్పుడు ఏడుస్తారు. లేదంటే ఒక వ్యక్తి పరిమితికి మించి ఆనందాన్ని పొందినప్పుడు కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. కానీ భోజనం చేసేటప్పుడు
Updated on: Mar 06, 2022 | 3:58 PM

సాధారణంగా వ్యక్తులు నొప్పి ఉంటే ఏడుస్తారు. లేదంటే భావోద్వేగానికి గురైనప్పుడు ఏడుస్తారు. లేదంటే ఒక వ్యక్తి పరిమితికి మించి ఆనందాన్ని పొందినప్పుడు కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. కానీ భోజనం చేసేటప్పుడు ఏడ్చే వ్యక్తి గురించి ఎప్పుడైనా విన్నారా.. చైనాలో ఒక వ్యక్తి వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతడు ఎప్పుడు ఆహారం తిన్నా కళ్లలో నుంచి నీళ్లు వస్తాయి. అది దుఃఖం కాదు. ఓ వింత వ్యాధి అని తెలిసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు.

చైనాలోని జాంగ్ అనే వ్యక్తి అరుదైన సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. అతడు ఎప్పుడు ఆహారం తిన్నా ఏడ్చుకుంటూ తింటాడు. దీంతో అందరు అతడిని వింతగా చూస్తారు.

జాంగ్ ఆహారం తినడానికి హోటల్ వెళ్లినప్పుడల్లా అతని కళ్లలో నుంచి నీళ్లు వస్తాయి. దీంతో అందరు అతడినే చూస్తారు. దీంతో అతడు హోటల్‌కి వెళ్లడమే మానేశాడు.

మొదట్లో జాంగ్ స్వభావరీత్యా ఏదైనా సమస్య ఉండొచ్చని భావించి వైద్యులకు చూపించారు. అతడికి క్రోకోడైల్ సిండ్రోమ్ అనే అరుదైన వింత వ్యాధి ఉన్నట్లు తేలింది.

వైద్యుల ప్రకారం.. జాంగ్‌కు అంతకుముందు ముఖ పక్షవాతం వచ్చింది. దాని నుంచి అతను కోలుకుంటున్నాడు. ఈ కోలుకునే సమయంలో ఆహారం వాసనకు బదులుగా కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి.





























