- Telugu News Photo Gallery Viral photos Know how this british couple converted a double decker bus into a luxurious two storey house
Viral Photos: డబుల్ డెక్కర్ బస్సుని ‘రెండు అంతస్తుల ఇల్లు’గా మార్చిన బ్రిటీష్ కపుల్.. లోపల చూస్తే మహాద్భుతం..
Viral Photos: ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఇల్లు నిర్మించడం చాలా కష్టం. ప్రపంచంలో చాలా మంది ఇల్లు కొన్నప్పటికీ గృహ రుణ భారంలోనే ఉన్నారు.
Updated on: Mar 07, 2022 | 11:43 AM

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఇల్లు నిర్మించడం చాలా కష్టం. ప్రపంచంలో చాలా మంది ఇల్లు కొన్నప్పటికీ గృహ రుణ భారంలోనే ఉన్నారు. ఇలాంటి భారం నుంచి తప్పించుకోవడానికి లండన్‌కు చెందిన ఒక జంట పాత డబుల్ డెక్కర్ బస్సును ఇంటిగా మార్చుకుంది.

ది సన్ నివేదించిన ప్రకారం.. చార్లీ మాక్‌వికార్ ఆమె ప్రియుడు ల్యూక్ వాకర్ డబుల్ డెక్కర్ బస్సును 'రెండు అంతస్తుల ఇల్లు'గా మార్చారు. ఇందులో అన్ని సౌకర్యాలను కల్పించారు.

ఈ విలాసవంతమైన డబుల్ డెక్కర్ బస్సులో బెడ్‌రూమ్‌లతో పాటు బాత్‌రూమ్‌లు, కిచెన్‌లు ఉన్నాయి. ఇది కాకుండా చిన్న కార్యాలయం కూడా ఉంది.

వంటగది, కార్యాలయం మొదటి అంతస్తులో ఉండగా, రెండో అంతస్తును బెడ్‌రూమ్‌గా మార్చారు. బాత్రూమ్ కూడా పై అంతస్తులో ఉంది. ఈ ఇంటిలోపల డెకరేషన్ చూస్తే ఆశ్చర్యపోతారు.

నివేదికల ప్రకారం.. 2017 సంవత్సరంలో ఈ జంట రూ. 2.5 లక్షలకు డబుల్ డెక్కర్ బస్సును కొనుగోలు చేసింది. ఆ తర్వాత దీనిని విలాసవంతమైన ఇల్లుగా మార్చడానికి రూ.18 లక్షలు ఖర్చు చేసింది.





























