AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: నేనూ బాధితుడినే.. ఓపెన్ అయిన కేటీఆర్.. ఆశ్చర్యపోయిన జనం..

తెలంగాణలో డైనమిక్‌ లీడర్‌గా పేరొందిన మంత్రి కేటీఆర్‌ (KTR) తన ఆరోగ్యానికి సంబంధించి ఆసక్తికర అంశాన్ని రివీల్‌ చేశారు.

KTR: నేనూ బాధితుడినే.. ఓపెన్ అయిన కేటీఆర్.. ఆశ్చర్యపోయిన జనం..
Minister KTR
Basha Shek
|

Updated on: Mar 05, 2022 | 7:54 PM

Share

తెలంగాణలో డైనమిక్‌ లీడర్‌గా పేరొందిన మంత్రి కేటీఆర్‌ (KTR) తన ఆరోగ్యానికి సంబంధించి ఆసక్తికర అంశాన్ని రివీల్‌ చేశారు. తనకు షుగర్‌ ఉందని.. 16 ఏళ్ల క్రితం పరీక్షలు చేయించుకుంటే ఈ విషయం తెలిసిందని స్వయంగా వెల్లడించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్​ప్రాజెక్టును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి డయాబెటిస్‌పై అవగాహన పెంచుకోవాలని పిలుపునిస్తూ.. తన ఆరోగ్య పరిస్థితిని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఆరోగ్య తెలంగాణలో భాగంగా వైద్యారోగ్య శాఖ బృందాలు ఇంటింటికీ వచ్చి పరీక్షలు చేస్తాయని మంత్రి తెలిపారు. ఎత్తు, బరువు, బీపీ, షుగర్ వంటి వ్యాధులతో పాటు కిడ్నీ, గుండె, లివర్ సంబంధింత వైద్య పరీక్షలు చేస్తారని.. ఆ డేటాను ఈ హెల్త్ ప్రొఫైల్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారని చెప్పారు. 60 రోజుల్లో పరీక్షలన్నీ పూర్తవుతాయన్నారు. ఆరోగ్యానికి సంబంధించి డేటా ఉండడం వల్ల ఆస్పత్రికి వెళ్లినప్పుడు సత్వర వైద్యం అందించేందుకు వీలుపడుతుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

విమర్శలు చేయడం సులువే.. ఇక ఎల్లారెడ్డిపేట మండ‌లం వెంక‌టాపూర్ గ్రామంలో నూత‌నంగా నిర్మించిన డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవన్నారు. ఎవరికైనా విమర్శలు చేయడం సులభంగానే ఉంటుందని.. కానీ పనిచేసినప్పుడే చేసిన ఆ కష్టం విలువ తెలుస్తుందని మంత్రి బీజేపీ, కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు కేటీఆర్‌.

Also Read:Viral Photos: హాలీవుడ్ హల్క్‌ సినిమా చూశారా.. ఇప్పుడు నిజ జీవితంలో హల్క్‌ని చూడండి..!

TV9 Digital TOP 9 News: అంబులెన్స్‌లో పెళ్లి మండపానికి వరుడు | సమంత..ఓ లేడీ విరాట్‌ కోహ్లీ.. వీడియో

Bhanu Shree: అల్ట్రా మోడ్రెన్ ​ లుక్స్ తో కట్టిపడేస్తున్న బిగ్​ బాస్ బ్యూటీ భాను శ్రీ లేటెస్ట్ పిక్స్