AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Meeting: న్యూట్రల్ ఆల్కాహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవొద్దు.. కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్ రావు..

GST Meeting: న్యూట్రల్ ఆల్కాహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచన సమంజసం కాదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.

GST Meeting: న్యూట్రల్ ఆల్కాహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవొద్దు.. కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్ రావు..
Harish Rao
Shiva Prajapati
|

Updated on: May 28, 2021 | 11:56 PM

Share

GST Meeting: న్యూట్రల్ ఆల్కాహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచన సమంజసం కాదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 43వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన న్యూట్రల్ ఆల్కాహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని తోసిపుచ్చారు. జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి కేవలం ఎక్సైజ్, పెట్రోల్ అండ్‌డిజీల్ మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. సెస్, సర్ ఛార్జీల రూపంలోనే కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోందని పేర్కొన్నారు. గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ లో 18శాతం సర్ చార్జి, సెస్ ల రూపంలోనే వచ్చిందన్నారు.

22.17 లక్ష కోట్ల బడ్జెట్‌లో 3.99 లక్షల కోట్ల ఆదాయం సెస్, సర్వీస్ ఛార్జీల ద్వారా సమకూరిందని మంత్రి హరీష్ రావు వివరించారు. రాష్ట్రాలు.. 1.64 లక్షల కోట్లు అంటే 41 శాతం ఆదాయం కేంద్రం వసూలు చేస్తోన్న సెస్‌లు, సర్ ఛార్జీల ద్వారా కోల్పోతున్నాయని చెప్పారు. వీటిలో తెలంగాణ రాష్ట్రం ప్రతీ ఏటా రూ. 3,439 కోట్లు అంటే 2.102 శాతం ఆదాయం కోల్పోతుందని వివరించారు. ఇప్పుడు ఆల్కాహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి రాష్ట్రాల అంతో ఇంతో సమకూరే ఆదాయాల మీద దెబ్బకొట్టొద్దన్నారు. ఆల్కాహాల్‌ను అన్ని రాష్ట్రాల మంత్రులు కోరుతున్నట్లుగా జీఎస్టీ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఆల్కాహాల్‌ను జీఎస్టీలో చేరిస్తే రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయన్నారు. జీఎస్టీ పరిధి నుంచి శ్వాత్వతంగా న్యూట్రల్ ఆల్కాహాల్‌ను మినహాయించేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు కోరారు.

Also read:

Ileana D’Cruz: సినిమా ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన గోవాబ్యూటీ ఇలియానా.. ఏమన్నదంటే

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి