RRR Update: ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలైన ….. రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ చేసేలా అగ్రిమెంట్… కీల‌క అప్‌డేట్ !

కరోనా ఎఫెక్ట్‌తో సినిమాల రిలీజ్ స్టైలే మారిపోయింది. థియేట్రికల్ రిలీజ్‌ కన్నా ముందే డిజిటల్ రిలీజ్‌ గురించి డిస్కస్ చేస్తున్నారు ఆడియన్స్‌. అయితే ఈ విషయంలో...

RRR Update: 'ఆర్.ఆర్.ఆర్' విడుదలైన ..... రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ చేసేలా అగ్రిమెంట్... కీల‌క అప్‌డేట్ !
Rrr Movie
Follow us
Ram Naramaneni

|

Updated on: May 28, 2021 | 10:45 PM

కరోనా ఎఫెక్ట్‌తో సినిమాల రిలీజ్ స్టైలే మారిపోయింది. థియేట్రికల్ రిలీజ్‌ కన్నా ముందే డిజిటల్ రిలీజ్‌ గురించి డిస్కస్ చేస్తున్నారు ఆడియన్స్‌. అయితే ఈ విషయంలో ట్రిపులార్‌ టీమ్‌.. ఒక అడుగు ముందే ఉంది. థియేట్రికల్ రిలీజ్ మీద క్లారిటీ రాకపోయినా… డిజిటల్ రిలీజ్ విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. తాజాగా ట్రిపులార్ యూనిట్ డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌కు సంబంధించి ఎనౌన్స్‌మెంట్ ఇచ్చింది. సినిమా హక్కులు సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థలు, టీవీ ఛానల్స్‌ను ఓకే సారి ప్రకటించింది. ఇండియా లెవల్‌లో గతంలో ఈ రేంజ్‌ డీల్‌ ఇంత వరకు జరగలేదని గ్రాండ్‌గా ఎనౌన్స్‌ చేసింది మూవీ టీమ్‌. అయితే ఈ అప్‌డేట్‌కు కొనసాగింపుగా మరో న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా ట్రిపులార్‌ రిలీజ్ డేట్‌ అయితే ఫిక్స్ అవ్వలేదు. కానీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా… విడుదలైన 70 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ చేసేలా అగ్రిమెంట్ జరిగిందట. మరి 70 రోజుల్లో ట్రిపులార్‌ గత రికార్డ్‌లను తిరగరాస్తుందా..? చూద్దాం.

‘ఆర్.ఆర్.ఆర్’ లో ఆమె సర్ప్రైజ్ ప్యాకేజ్: విజయేంద్ర ప్రసాద్

ఇక‌ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా నుంచి వ‌స్తోన్న ఒక్కో అప్‌డేట్ అంచ‌నాలు పెంచేస్తోంది. సినిమా చూశానని చాలా బాగా వచ్చిందని రాజమౌళి తండ్రి, ర‌చ‌యిత‌ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇందులో అలియా భట్ ఓ సర్ప్రైజ్ ప్యాకేజ్ అని.. ఆమె తెరపై కనిపించే సమయం తక్కువే అయినా ప్రతి సీన్ అద్బుతంగా ఉంటుంద‌ని చెప్పారు. ఈ మధ్య RRR యాక్షన్ సీన్స్ గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్.. ఇప్పుడు అలియా పాత్ర గురించి కూడా లీక్ వ‌దిలాగా. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ టాలీవుడ్ లో ప‌రిచ‌యం అవ్వ‌బోతుంది. ఇందులో చరణ్ కు జోడీగా ‘సీత’ పాత్రలో ఆమె కనిపించనుంది.

Also Read: ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్​ ఫంగస్​ వస్తుందా…? ఇదిగో క్లారిటీ

బిర్యానీ ఆర్డ‌ర్ స‌రిగ్గా ఇవ్వ‌లేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజ‌న్.. మంత్రి రిప్లై భ‌లే ఫ‌న్నీ