Rajeev Rayala |
Updated on: May 28, 2021 | 10:58 PM
ఇలియానా ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి ఈ చిన్నది. దేవదాసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైనా ఇలియానా తర్వాత తక్కువ ,టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసింది ఇలియానా
ఇక్కడ రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్ చెక్కేసింది కానీ అక్కడ అనుకున్నంతగా ఆఫర్లు పలకరించలేదు. ఆతర్వాత లవ్ , బ్రేకప్, డిప్రషన్, బరువు పెరగడం ఇలా చకచకా అన్ని జరిగిపోయాయి.
ఆతర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మంచి కథ దొరికితే తిరిగి టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తుంది ఇల్లీబేబీ.
ఆ మధ్య తెలుగులో కేవలం తనను గ్లామర్ పాత్రలకే అంకితం చేసారని అందుకే నాకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు దొరకలేదని వాపోయింది.
ఇటీవల ఇలియానా మాట్లాడుతూ ..ఇండస్ట్రీ అనేది చాలా క్రూరమైన ప్రదేశం అనే చెప్పాలి. ప్రజాదరణ విషయంలో సినీ పరిశ్రమలో సమతుల్యం ఉండదని సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది.